Share News

భారత్‌తో టీ20.. ఇంగ్లండ్‌ ఘన విజయం

ABN , Publish Date - Jul 04 , 2026 | 11:04 PM

భారత్‌తో ఓల్డ్ ట్రాఫర్డ్ వేదికగా జరిగిన టీ20 మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 191 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ సులువుగా ఛేదించింది. 4 వికెట్ల తేడాతో విజయం సొంతం చేసుకుంది.

భారత్‌తో టీ20.. ఇంగ్లండ్‌ ఘన విజయం
Eng Beats Ind By 4 Wickets

ఇంటర్నెట్ డెస్క్: భారత్‌తో ఓల్డ్ ట్రాఫర్డ్ వేదికగా జరిగిన టీ20 మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 191 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ సులువుగా ఛేదించింది. 4 వికెట్ల తేడాతో విజయం సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న విషయం తెలిసిందే. తొలిసారిగా ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ స్వల్ప స్కోరుకే వెనుదిరిగినా అభిషేక్ శర్మ, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ రాణించడంతో భారత్ 190 పరుగుల గౌరవప్రదమైన స్కోరు చేసింది.


అనంతరం బరిలోకి దిగిన ఇంగ్లండ్‌కు ఆదిలోనే భారీ ఎదురుదెబ్బలు తగిలాయి. అర్షదీప్ బౌలింగ్ ‌లో ఓపెనర్లు ఫిల్ సాల్ట్, జాస్ బట్లర్ వెనుదిరగడంతో ఇంగ్లండ్‌కు ఊహించని షాక్ తగిలింది. ఆ తరువాత బరిలోకి వచ్చిన హ్యారీ బ్రూక్ మ్యాచ్ మొత్తాన్ని మలుపు తిప్పాడు. 15 బంతుల్లో 39 పరుగులు చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. అనంతరం జేకబ్ బెతెల్(76), టామ్ బ్యాంటెన్‌ల (39) భాగస్వామ్యం జట్టును పటిష్ఠ స్థితికి చేర్చింది. ముఖ్యంగా బెతెల్ తన మెరుపు ఇన్నింగ్స్‌తో ఇంగ్లండ్‌ను తిరుగులేని స్థితిలో నిలిపిపాడు. అంతిమంగా విజయం ఇంగ్లండ్ సొంతమైంది. భారత బౌలర్లలో అర్షదీప్ మూడు వికెట్లు తీయగా హర్షిత్ రాణా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి చెరొక వికెట్ తీశారు.


ఈ వార్తలనూ చదవండి:

అలా అయితే ఇప్పుడే ఆడించలేమని వైభవ్‌కు చెప్పండి: పార్థివ్ పటేల్

భారత క్రికెట్ మేనేజ్‌మెంట్‌కు సూర్యకుమార్ యాదవ్ ఫన్నీ కౌంటర్!

Updated Date - Jul 04 , 2026 | 11:13 PM