అదే.. ఆమె విజయ సూత్రం
ABN , Publish Date - Sep 21 , 2026 | 05:43 AM
తమిళనాడు షూటర్ ఎలవెనిల్ వలరివన్ ఆసియాడ్‌లో ఏకంగా రెండు రజతాలతో డబుల్ ధమాకా సృష్టించింది. అయితే, 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత ఈవెంట్‌లో...
షూటింగ్‌లో రెండు రజతాలు
తమిళనాడు షూటర్ ఎలవెనిల్ వలరివన్ ఆసియాడ్‌లో ఏకంగా రెండు రజతాలతో డబుల్ ధమాకా సృష్టించింది. అయితే, 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత ఈవెంట్‌లో త్రుటిలో స్వర్ణం చేజారినా.. వలరివన్ ఎంతో నిబ్బరంగా కనిపించడం అందరినీ ఆకర్షించింది. హోరాహోరీగా సాగిన పసిడి పోరులో ఆరంభంలో ముందంజలో ఉన్నా.. చివరి రౌండ్లలో గురి తప్పడంతో వలరివన్ కేవలం 0.6 పాయింట్ల తేడాతో రెండో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయినా, ఆమెలో ఎలాంటి అసహనం కనిపించలేదు. ప్రశాంత వదనంతో కనిపించింది. ఫలితాలు ఎలా ఉన్నా, చివరి క్షణాల్లో తప్పులు దొర్లినా, గందరగోళానికి లోనవకుండా స్థిరంగా ఉండడమే తనకు తెలిసిన విజయ సూత్రం అని ఎలవెనిల్ తెలిపింది. ఒత్తిడిని జయించి, నిరంతరం నేర్చుకుంటూ ముందుకు సాగడమే తనకు ముఖ్యమని పేర్కొంది. అన్నట్టు.. ఎలవెనిల్ ఆసియాడ్‌లో పతకాలు నెగ్గడం ఇదే తొలిసారి.
ఇవి కూడా చదవండి:
న్యూజిలాండ్ టూర్: టీమిండియాకు కొత్త చిక్కులు.. కీలక ప్లేయర్లకు విశ్రాంతి?