ప్రీక్వార్టర్స్‌కు ధ్రువ్ ద్వయం
ABN , Publish Date - Apr 08 , 2026 | 03:11 AM
బ్యాడ్మింటన్ ఆసియా చాంపియన్‌షి్‌ప్సలో ధ్రువ్ కపిల జంట ముందంజ వేయగా.. రోహన్, అషిత్ జోడీలు ఇంటిముఖం...
ఆసియా బ్యాడ్మింటన్
నింగ్‌బో (చైనా): బ్యాడ్మింటన్ ఆసియా చాంపియన్‌షి్‌ప్సలో ధ్రువ్ కపిల జంట ముందంజ వేయగా.. రోహన్, అషిత్ జోడీలు ఇంటిముఖం పట్టాయి. మంగళవారం జరిగిన మిక్స్‌డ్ డబుల్స్ తొలి రౌండ్‌లో ధ్రువ్-తనీషా ద్వయం 21-14, 11-21, 21-15తో థాయ్‌లాండ్‌కు చెందిన హోర్బాన్‌ల్యూకిట్-బెన్యాపాపై గెలిచి ప్రీక్వార్టర్స్‌కు చేరుకొంది. రోహన్-రుత్విక జోడీ 13-21, 19-21 మలేసియా జంట గో సూన్ హౌట్-లై షివోన్ చేతిలో, అషిత్ సూర్య-అమృత జోడీ 16-21, 15-21తో మలేసియా ద్వయం వోంగ్ టైన్ సి-లిమ్ చ్యూ సైన్ చేతిలో ఓటమి పాలయ్యారు.
ఇవి కూడా చదవండి:
ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ అరెస్ట్
ఓటములకు బౌలర్లను మాత్రమే కారణంగా చూపొద్దు: క్లాసెన్