అంతర్జాతీయ రెజ్లర్‌పట్ల వ్యవహరించే తీరేనా ఇది?
ABN , Publish Date - May 23 , 2026 | 02:34 AM
వినేశ్ ఫొగట్ వంటి అంతర్జాతీయ రెజ్లర్‌పట్ల భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎ్‌ఫఐ) వ్యవహరిస్తున్న తీరును ఢిల్లీ హైకోర్టు ఆక్షేపించింది...
వినేశ్‌పై నిషేధాన్ని తప్పుపట్టిన కోర్టు
న్యూఢిల్లీ: వినేశ్ ఫొగట్ వంటి అంతర్జాతీయ రెజ్లర్‌పట్ల భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎ్‌ఫఐ) వ్యవహరిస్తున్న తీరును ఢిల్లీ హైకోర్టు ఆక్షేపించింది. దేశవాళీ పోటీలలో పాల్గొనకుండా ఆమెపై విధించిన నిషేధాన్ని తప్పుబట్టింది. అంతేకాదు..పారిస్ ఒలింపిక్స్‌లో వినేశ్‌పై వేసిన అనర్హతను ‘జాతికి అవమానం’గా డబ్ల్యూఎ్‌ఫఐ వర్ణించడాన్ని ఆగ్రహించింది. కాగా..జాతీయ టోర్నమెంట్లలో వినేశ్ పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ఈమేరకు జస్టిస్ డీకే ఉపాధ్యాయ, జస్టిస్ తేజాస్ కరియా శుక్రవారం తీర్పు చెప్పారు. వినేశ్ పరిస్థితిని అంచనా వేసి, ఆసియా క్రీడల ఎంపిక పోటీలలో తలపడేలా నిపుణుల ప్యానెల్ ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరింది. మే 30-31వ తేదీలలో ఆసియాడ్ ఎంపిక పోటీలలో తనకు పాల్గొనే అవకాశం కల్పించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టును వినేశ్ ఆశ్రయించగా.. సింగిల్ జడ్జి ఆమె విన్నపాన్ని మన్నించేందుకు తిరస్కరించారు. దాంతో వినేశ్ డివిజన్ బెంచ్‌కు అప్పీలు చేసింది.
ఇవి కూడా చదవండి:
బిహార్‌కీ ఓ ఐపీఎల్ టీమ్ ఉండాలి: బిలియనీర్ అనిల్ అగర్వాల్
సీఎస్కే వైఫల్యానికి అసలు కారణం ఇదే: సెహ్వాగ్