దీపిక త్రయానికి పసిడి
ABN , Publish Date - May 11 , 2026 | 02:27 AM
నరాలు తెగే ఉత్కంఠను అదిమిపట్టిన భారత త్రయం వరల్డ్ కప్ స్టేజ్-2 మహిళల రికర్వ్ టీమ్ ఈవెంట్‌లో స్వర్ణ పతకాన్ని కొల్లగొట్టింది. ఆదివారం జరిగిన ఫైనల్...
షాంఘై: నరాలు తెగే ఉత్కంఠను అదిమిపట్టిన భారత త్రయం వరల్డ్ కప్ స్టేజ్-2 మహిళల రికర్వ్ టీమ్ ఈవెంట్‌లో స్వర్ణ పతకాన్ని కొల్లగొట్టింది. ఆదివారం జరిగిన ఫైనల్ షూటా్‌ఫలో దీపిక కుమారి, అంకిత భకత్, కుంకుంతో కూడిన భారత జట్టు 5-4 (28-26)తో హాట్ ఫేవరెట్ చైనాకు షాకిచ్చి టైటిల్ సొంతం చేసుకుంది. కొరియా జట్టు కాంస్య పతకం అందుకుంది. ఇక..ఈ వరల్డ్ కప్‌ను భారత్ ఒక స్వర్ణం, ఒక కాంస్య పతకంతో ముగించింది. కాంపౌండ్ పురుషుల విభాగంలో సాహిల్ జాదవ్ కాంస్యం నెగ్గిన సంగతి తెలిసిందే. కాగా, రికర్వ్ మహిళల వ్యక్తిగత ఈవెంట్ కాంస్య పతక పోరులో సిమ్రన్‌జిత్ కౌర్ 4-6తో జాంగ్ మిని (కొరియా) చేతిలో ఓటమిపాలైంది.
ఇవి కూడా చదవండి:
రషీద్ ఖాన్ ఖాతాలో మరో అరుదైన మైలురాయి
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన పాకిస్థాన్ స్టార్ ప్లేయర్