డేవిడ్ వార్నర్ అరెస్ట్
ABN , Publish Date - Apr 08 , 2026 | 03:18 AM
ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌ను స్థానిక పోలీసులు అరెస్ట్ చేశారు. మద్యం తాగి వాహనం నడిపినందుకు ఆదివారం సాయంత్రం...
సిడ్నీ: ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌ను స్థానిక పోలీసులు అరెస్ట్ చేశారు. మద్యం తాగి వాహనం నడిపినందుకు ఆదివారం సాయంత్రం అతడిని అదుపులోకి తీసుకున్నట్టు ఆసీస్ మీడియాలో కథనాలు వచ్చాయి. రోడ్డుపై పోలీసులు నిర్వహించే డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పరీక్షిం చగా వార్నర్ మద్యం సేవించినట్టు తేలింది. వెంటనే వార్నర్‌ను పోలీస్ స్టేషన్‌కు తరలించగా, కాసేపటికే వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్ ఇచ్చా రు. కానీ వచ్చే నెల 7న కోర్టు ఎదుట హాజరుకావాల్సి ఉంది. ప్రస్తుతం పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో వార్నర్ కరాచీ కింగ్స్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. తమ జట్టుకు ఆరు రోజుల విరామం రావడంతో స్వదేశం వచ్చాడు.
ఇవి కూడా చదవండి:
ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ అరెస్ట్
ఓటములకు బౌలర్లను మాత్రమే కారణంగా చూపొద్దు: క్లాసెన్