షనకపై పీఎస్ఎల్ ఏడాది నిషేధం
ABN , Publish Date - Apr 21 , 2026 | 07:05 AM
శ్రీలంక కెప్టెన్ దసున్ షనక పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో ఏడాదిపాటు పాల్గొనకుండా..పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) నిషేధం...
కరాచీ: శ్రీలంక కెప్టెన్ దసున్ షనక పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో ఏడాదిపాటు పాల్గొనకుండా..పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) నిషేధం విధించింది. వాస్తవంగా పాకిస్థాన్ సూపర్ లీగ్ జట్టు లాహోర్ కలందర్స్ తరపున ఆడేందుకు షనక ఒప్పందం కుదుర్చుకున్నాడు. కానీ పీఎస్ఎల్ నుంచి వైదొలగిన లంక ఆల్‌రౌండర్ ఐపీఎల్ జట్టు రాజస్థాన్ రాయల్స్‌కు జైకొట్టాడు. దాంతో షనకపై పీసీబీ చర్యలు చేపట్టింది. అలాగే మరో పీఎ్‌సఎల్ జట్టు ఇస్లామాబాద్ యునైటెడ్‌కు గుడ్‌బై చెప్పి కోల్‌కతా నైట్‌రైడర్స్‌లో చేరిపోయిన జింబాబ్వే పేసర్ బ్లెసింగ్ ముజరబానీపై గతంలో రెండేళ్ల నిషేధాన్ని పీసీబీ విధించిన సంగతి తెలిసిందే.
Also Read:
ఏసీబీ వలలో వీఆర్వో.. లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టివేత
జగన్‌వి క్రిమినల్ రాజకీయాలు.. మంత్రి నిమ్మల ధ్వజం
For More Latest News