Share News

రొనాల్డో కిక్‌

ABN , Publish Date - Jul 04 , 2026 | 05:26 AM

ఈ ప్రపంచ కప్‌ గ్రూప్‌ దశలో పెద్దగా ఆకట్టుకోలేక పోయిన క్రిస్టియానో రొనాల్డో కీలకమైన నాకౌట్‌ సమరంలో అసలైన ఆటతీరును ప్రదర్శించాడు. క్రొయేషియాతో పోరులో బుల్లెట్‌లాంటి ‘కిక్‌’తో...

రొనాల్డో కిక్‌

ఫిఫా కప్‌ మ్యాచ్‌లు

కొలంబియా X ఘనా

(ఉదయం 7.00)

ప్రీక్వార్టర్స్‌

కెనడా X మొరాకో

(రాత్రి 10.30)

ఫ్రాన్స్‌ X పరాగ్వే

(ఆదివారం తెల్లవారుజాము 2.30)

  • క్రొయేషియా నాకౌట్‌

  • ప్రీక్వార్టర్స్‌కు పోర్చుగల్‌

ఈ ప్రపంచ కప్‌ గ్రూప్‌ దశలో పెద్దగా ఆకట్టుకోలేక పోయిన క్రిస్టియానో రొనాల్డో కీలకమైన నాకౌట్‌ సమరంలో అసలైన ఆటతీరును ప్రదర్శించాడు. క్రొయేషియాతో పోరులో బుల్లెట్‌లాంటి ‘కిక్‌’తో మ్యాచ్‌ను సమం చేశాడు. ఆపై యువ స్ట్రయికర్‌ రమోస్‌ గోల్‌ కొట్టడంతో పోర్చుగల్‌ ప్రీ క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది.

టొరొంటో: క్రిస్టియానో రొనాల్డో మెరిశాడు. కీలకమైన తరుణంలో చెలరేగాడు. క్రొయేషియాతో రౌండ్‌-32 మ్యాచ్‌లో పెనాల్టీ కిక్‌ను పొరపాటులేకుండా గోల్‌పో్‌స్టలోకి కొట్టిన 41 ఏళ్ల రొనాల్డో స్కోరు సమం చేసేందుకు తోడ్పడ్డాడు. ఇక హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో పోర్చుగల్‌ 2-1తో క్రొయేషియాపై విజయం సాధించింది. ఇవాన్‌ పెరిసిక్‌ 53వ నిమిషంలో గోల్‌ చేసి క్రొయేషియాను ఆధిక్యంలో నిలిపాడు. పెనాల్టీని రొనాల్డో (68ని) గోల్‌గా మలిచి స్కోరును సమం చేశాడు. ఆపై స్టాపేజ్‌ సమయం (90+4)లో సబ్‌స్టిట్యూట్‌ ఆటగాడు గొంకాలో రమోస్‌ కీలక గోల్‌ చేసి పోర్చుగల్‌ను విజయపథాన నిలిపాడు. సోమవారం డాల్‌సలో జరిగే రౌండ్‌-16 మ్యాచ్‌లో స్పెయిన్‌తో పోర్చుగల్‌ అమీతుమీ తేల్చుకుంటుంది.

తొలి గోల్‌ క్రొయేషియాదే..: రెండు జట్లు నువ్వా..నేనా..అనేలా తలపడడంతో ప్రథమార్థంలో ఒక్క గోల్‌ కూడా నమోదు కాలేదు. 53వ నిమిషంలో ఇవాన్‌ బాక్స్‌ ఎడమవైపునుంచి ఎడమ కాలితో కొట్టిన షాట్‌ రయ్‌న దూసుకుపోయి గోల్‌పోస్టులో పడింది. కంగుతిన్న పోర్చుగల్‌ ఒక్కసారిగా గేరు మార్చింది. కొద్దిసేపటికే పెనాల్టీ ఏరియాలో పోర్చుగల్‌ ఆటగాడు వీగోను క్రొయేషియా మిడ్‌ఫీల్డర్‌ వ్లాసిక్‌ అడ్డుకోవడంతో..రెఫరీ పోర్చుగల్‌కు పెనాల్టీ కిక్‌ను ప్రకటించాడు. దానిని రొనాల్డో గోల్‌గా మలచడంతో పోర్చుగల్‌ ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. తర్వాత ఇం జ్యూరీ సమయంలో రాఫెల్‌ నుంచి వచ్చిన పాస్‌ను రమోస్‌ హెడర్‌తో గోల్‌పో్‌స్టలోకి పంపడంతో పోర్చుగల్‌ విజయభేరి మోగించింది.


6-Sports.jpg

మైకేల్‌ డబుల్‌: స్పెయిన్‌ గెలుపు

మైకేల్‌ ఒయర్‌జబాల్‌ (36, 89ని.) రెండు గోల్స్‌తో చెలరేగడంతో స్పెయిన్‌ 3-0తో ఆస్ట్రియాను ఓడించి రౌండ్‌-16లో అడుగుపెట్టింది. పెడ్రో పోరో (66ని.) మరో గోల్‌ చేశాడు. ఇక స్పెయిన్‌ గోల్‌కీపర్‌ ఉనై సిమోన్‌ గిన్నిస్‌బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డుల్లోకెక్కాడు. గోల్‌కీపర్‌గా వరుసగా 519 నిమిషాలు ఒక్క గోల్‌ కూడా ఇవ్వకపోవడం ద్వారా చరిత్ర సృష్టించాడు. దీంతో 1990 ప్రపంచక్‌పలో ఇటలీ గోల్‌ కీపర్‌ వాల్డర్‌ జెంగా 517 నిమిషాలతో నెలకొల్పిన రికార్డును ఉనై బద్దలుగొట్టాడు.

స్విట్జర్లాండ్‌ 88 ఏళ్ల తర్వాత..

స్విట్జర్లాండ్‌ 88 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత వరల్డ్‌ కప్‌ నాకౌట్‌ మ్యాచ్‌లో గెలుపు రుచి చూసింది. రౌండ్‌-32 మ్యాచ్‌లో 2-0తో అల్జీరియాను ఓడించింది. ఎంబోలో (10ని.), డోయ్‌ (46ని.) చెరో గోల్‌తో స్విట్జర్లాండ్‌ను గెలిపించారు. 1938 మెగా టోర్నీలో చివరిసారి స్విట్జర్లాండ్‌ నాకౌట్‌ పోరు నెగ్గింది.

1

అత్యధిక వయస్సులో ప్రపంచ కప్‌ నాకౌట్‌ మ్యాచ్‌ బరిలోకి దిగడంతో పాటు, ఈ మ్యాచ్‌లో గోల్‌ చేసిన ఆటగాడిగా రొనాల్డో (41 ఏళ్ల 147 రోజులు) రికార్డుకెక్కాడు.

ఈ వార్తలనూ చదవండి:

వీధులు శుభ్రం చేసినట్టు ఏఐ చిత్రాలు.. మున్సిపల్ సిబ్బందిపై వేటు

సింధు జలాలపై భారత్‌ కఠిన వైఖరి.. ఉగ్రవాదం ఆగేదాకా..

Updated Date - Jul 04 , 2026 | 05:27 AM