గర్జించిన రొనాల్డో
ABN , Publish Date - Jun 24 , 2026 | 05:54 AM
పసికూన డీఆర్ కాంగోతో మ్యాచ్‌లో పేలవ ప్రదర్శన.. చుట్టు ముట్టిన విమర్శలు.. తన సామర్థ్యంపైనే సందేహాలు.. ఆఖరికి జట్టులో చోటుపైకూడా అనుమానాలు! వీటన్నింటిని క్రిస్టియానో రొనాల్డో...
పోర్చుగల్ బోణీ
5-0తో ఉజ్బెకిస్థాన్‌పై గెలుపు
రెండు గోల్స్‌తో చెలరేగిన క్రిస్టియానో
పసికూన డీఆర్ కాంగోతో మ్యాచ్‌లో పేలవ ప్రదర్శన.. చుట్టు ముట్టిన విమర్శలు.. తన సామర్థ్యంపైనే సందేహాలు.. ఆఖరికి జట్టులో చోటుపైకూడా అనుమానాలు! వీటన్నింటిని క్రిస్టియానో రొనాల్డో ఒక్క మ్యాచ్‌తో పటాపంచలు చేశాడు. ఉజ్బెకిస్థాన్‌తో పోరులో డబుల్ స్ట్రయిక్‌తో గర్జించాడు. ఆడిన ఆరు వరల్డ్‌కప్‌ల్లో గోల్స్ చేసిన ఏకైక ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.
హూస్టన్: గోల్ మెషీన్ క్రిస్టియానో రొనాల్డో.. ఆడిన ఆరు వరల్డ్‌క్‌పల్లోనూ గోల్స్ చేసిన ఏకైక ఆటగాడిగా అరుదైన రికార్డు సృష్టించాడు. పోర్చుగల్ స్టార్ రెండు గోల్స్‌తో సత్తాచాటడంతో.. సాకర్ ప్రపంచక్‌పలో భాగంగా గ్రూప్-కెలో మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్ పోర్చుగల్ 4-0తో ఉజ్బెకిస్థాన్‌పై గెలిచింది. రొనాల్డో (6వ, 39వ నిమిషం), నూనో మెండెస్ (17వ), రఫెల్ లియో (87వ)లు పోర్చుగల్ తరఫున గోల్స్ చేశారు. కాగా, 60వ నిమిషంలో ఉజ్బెక్ కీపర్ నిమటోవ్ సెల్ఫ్‌గోల్‌తో ప్రత్యర్థి ఆధిక్యాన్ని మరింతగా పెంచాడు. ఫస్టాఫ్ ఆరంభం నుంచే పోర్చుగల్ దూకుడుగా ఆడుతూ ఉజ్బెక్ గోల్‌పోస్టుపై దాడులు చేసింది. ఈ క్రమంలో ఆరో నిమిషంలోనే తగిన ఫలితం సాధించింది. కాన్సెలో క్రాస్‌ను నేరుగా గోల్‌లోకి పంపిన రొనాల్డో పోర్చుగల్‌ను 1-0 ఆధిక్యంలో నిలిపాడు. ఆ తర్వాత బాక్స్ అంచున నీటోను అభ్యంతరకరంగా అడ్డుకోవడంతో.. 17వ నిమిషంలో పోర్చుగల్‌కు ఫ్రీకిక్ లభించింది. రొనాల్డో కిక్ తీసుకొంటాడని అందరూ భావించారు. కానీ, నూనో మెండె్‌సకు వదిలేయడంతో.. అతడు నేరుగా బంతిని గోల్‌లోకి కొట్టాడు. దీంతో పోర్చుగల్ 2-0తో నిలిచింది. ఆ తర్వాత 39వ నిమిషంలో బ్రూనో ఫెర్నాండెజ్ పాస్‌ను అందుకొన్న రొనాల్డో.. ఏమాత్రం తొందరపడకుండా బంతిని లాఘవంగా గోల్‌లోకి పంపాడు. దీంతో ఫస్టా్‌ఫను పోర్చుగల్ 3-0తో ముగించింది. సెకండాఫ్ ఆరంభమైన 15వ నిమిషంలో ఉజ్బెక్ కీపర్ నిమటోవ్ సెల్ఫ్‌గోల్ చేశాడు. ఆ తర్వాత మ్యాచ్ నెమ్మదిగా సాగినా.. 87వ నిమిషంలో రఫెల్ పవర్‌ఫుల్ కిక్‌తో పోర్చుగల్‌కు ఐదో గోల్ అందించాడు.
ఇవి కూడా చదవండి:
భారత క్రికెట్ దిగ్గజం రోహిత్ శర్మకు అరుదైన గౌరవం
టీ20ల్లో ర్యాంకింగ్స్‌లో అగ్రపీఠం కైవసం చేసుకున్న శ్రీ చరణి