వైభవ్‌ను ఎందుకు ఆడించడం లేదు?
ABN , Publish Date - Jul 03 , 2026 | 01:25 AM
టీనేజి సంచలనం వైభవ్ సూర్యవంశీ క్రేజ్ ఎల్లలు దాటుతోంది. అతడి అరంగేట్రం కోసం భారత అభిమానులే కాకుండా విదేశీ మాజీ ఆటగాళ్లు సైతం...
మైకేల్ వాన్, కుక్
లండన్: టీనేజి సంచలనం వైభవ్ సూర్యవంశీ క్రేజ్ ఎల్లలు దాటుతోంది. అతడి అరంగేట్రం కోసం భారత అభిమానులే కాకుండా విదేశీ మాజీ ఆటగాళ్లు సైతం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈనేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్లు మైకేల్ వాన్, అలిస్టర్ కుక్ అతడికి మద్దతుగా నిలిచారు. ఇంగ్లండ్‌తో సిరీ్‌సలోనైనా చాన్స్ ఇవ్వాలని సూచించారు. ‘ఐర్లాండ్‌పై వైభవ్‌ను ఎందుకు ఆడించలేదో బీసీసీఐ, చీఫ్ సెలెక్టర్ అగార్కర్‌ను అడగాలి’ అని వాన్ పాడ్‌కా్‌స్టలో కామెంట్ చేయగా.. ‘ఆ 15 ఏళ్ల కుర్రాడి ఆట చూసేందుకు ఓ అభిమానిగా నేను వెళ్లబోతున్నా’ అని కుక్ బదులిచ్చాడు.
ఈ వార్తలనూ చదవండి:
వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఖాయమా.. జట్టు కూర్పు ఇలా ఉంటుందా..
మెస్సీకి ఒక న్యాయం.. బలోగన్‌కు మరో న్యాయమా.. అభిమానుల ఆగ్రహం..