ఇంగ్లండ్‌తో వన్డేలకు విరాట్
ABN , Publish Date - Jun 22 , 2026 | 05:42 AM
ఇంగ్లండ్‌తో మూడు వన్డేలకు ఆదివారం ప్రకటించిన భారత జట్టులో విరాట్ కోహ్లీకి చోటు కల్పించారు. అయితే ఫిటెనెస్ పరీక్షలో సఫలమైతేనే అతడు పర్యటనకు వెళతాడని....
ఫిట్‌నెస్ ఓకే అయితేనే.. బుమ్రా పునరాగమనం
న్యూఢిల్లీ: ఇంగ్లండ్‌తో మూడు వన్డేలకు ఆదివారం ప్రకటించిన భారత జట్టులో విరాట్ కోహ్లీకి చోటు కల్పించారు. అయితే ఫిటెనెస్ పరీక్షలో సఫలమైతేనే అతడు పర్యటనకు వెళతాడని బీసీసీఐ తెలిపింది. ఇక..ఇంగ్లండ్‌తో తెల్లబంతుల ఫార్మాట్‌లో తలపడే 15 మంది సభ్యుల టీమిండియాను సెలెక్టర్లు ఎంపిక చేశారు. టీ20లకు జట్టును ఇంతకుముందే ప్రకటించిన విషయం విదితమే. కాగా..కోహ్లీ బెంగళూరులోని సెంటరాఫ్ ఎక్స్‌లెన్స్‌లో సోమవారంనాడు ఫిట్‌నెస్ పరీక్షకు హాజరు కానున్నాడు. ఇక..గిల్ కెప్టెన్సీలోని జట్టులో జైస్వాల్‌ను తప్పించడం మినహా..అఫ్ఘాన్‌తో వన్డే సిరీస్ ఆడిన జట్టునే ఇంగ్లండ్ పర్యటనకు ఎంపిక చేశారు. పనిభారం నిర్వహణ కారణంగా అఫ్ఘానిస్థాన్‌తో సిరీస్‌కు విశ్రాంతి నిచ్చిన బుమ్రా కూడా జట్టులో పునరాగమనం చేశాడు. అలాగే అక్షర్ పటేల్ సైతం ఎంట్రీ ఇచ్చాడు. కాగా ఐర్లాండ్‌తో టీ20లకు గాయపడిన వరుణ్ చక్రవర్తి స్థానంలో ప్రిన్స్ యాదవ్‌కు చోటు కల్పించారు.
భారత జట్టు: గిల్ (కెప్టెన్), రోహిత్, విరాట్, శ్రేయాస్, కేఎల్ రాహుల్ (కీపర్), ఇషాన్ కిషన్ (కీపర్), సుందర్, అక్షర్, నితీశ్, కుల్దీప్, బుమ్రా, ప్రసిద్ధ్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్, గుర్నూర్ బ్రార్.
ఇవి కూడా చదవండి:
ముక్కోణపు సిరీస్ విజేతగా భారత్-ఎ
33 మ్యాచుల్లో 100 గోల్స్ .. 68 ఏళ్ల తర్వాత అత్యంత వేగంగా...