నాకదే చివరి వరల్డ్‌కప్: కోహ్లీ
ABN , Publish Date - Sep 27 , 2026 | 05:16 AM
వచ్చే ఏడాది జరిగే వన్డే వరల్డ్‌కప్ తన కెరీర్‌లో చివరిదని విరాట్ కోహ్లీ స్పష్టం చేశాడు. అందుకే ఎట్టి పరిస్థితిల్లోనూ జట్టును చాంపియన్‌గా...
వచ్చే ఏడాది జరిగే వన్డే వరల్డ్‌కప్ తన కెరీర్‌లో చివరిదని విరాట్ కోహ్లీ స్పష్టం చేశాడు. అందుకే ఎట్టి పరిస్థితిల్లోనూ జట్టును చాంపియన్‌గా నిలిపేందుకు ప్రయత్నిస్తానని తెలిపాడు. 37 ఏళ్ల విరాట్ ప్రస్తుతం వన్డే ఫార్మాట్‌లో మాత్రమే కొనసాగుతున్న విషయం తెలిసిందే. 2027లో జరిగే మెగా టోర్నీకి దక్షిణాఫ్రికా, నమీబియా, జింబాబ్వే సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. ‘భారత్ తరఫున వచ్చే ఏడాది చివరి వరల్డ్‌కప్ ఆడబోతున్నా. ఇంతకంటే ప్రేరణ ఇంకేం కావాలి. కప్ గెలవడమే మా టార్గెట్‌గా ఉండనుంది. నేనైతే స్వేచ్ఛగా ఆడాలనుకుంటున్నా’ అని కోహ్లీ తేల్చాడు. మరోవైపు తాను కూడా వరల్డ్‌కప్ ఆడేందుకు ఎదురుచూస్తున్నట్టు వెటరన్ రోహిత్ అభిప్రాయపడ్డాడు. అలాగే భవిష్యత్‌లో ఏం జరుగబోతుందో వేచిచూస్తానన్నాడు.
ఇవి కూడా చదవండి:
శుభ్‌మన్ గిల్ గాయంపై స్పందించిన టీమిండియా
నేను చేయాల్సిన పని మిగిలే ఉంది.. రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు