Share News

వృద్ధాశ్రమంలో వినోద్‌ కాంబ్లీ!

ABN , Publish Date - Sep 27 , 2026 | 02:55 AM

కొన్నేళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న భారత మాజీ ఆటగాడు వినోద్‌ కాంబ్లీ ప్రస్తుతం వృద్ధాశ్రమంలో ఉంటున్నట్టు...

వృద్ధాశ్రమంలో వినోద్‌ కాంబ్లీ!

ముంబై: కొన్నేళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న భారత మాజీ ఆటగాడు వినోద్‌ కాంబ్లీ ప్రస్తుతం వృద్ధాశ్రమంలో ఉంటున్నట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఆ వీడియోలో సరిగ్గా మాట్లాడలేని స్థితిలో ఉన్న కాంబ్లీని చూసి అభిమానులు ఆవేదన చెందుతున్నారు. తాను ప్రస్తుతం థానెలోని కేర్‌ సెంటర్‌లో చికిత్స తీసుకుంటున్నట్టు, ఇక్కడి వారంతా బాగా చూసుకుంటున్నారని ఆ వీడియోలో కాంబ్లీ కృతజ్ఞతలు తెలిపాడు. సచిన్‌ చిన్ననాటి స్నేహితుడిగా లోకానికి తెలిసిన కాంబ్లీ అసాధారణ ప్రతిభతో, అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యుత్తమ ఆటగాడిగా ఎదుగుతాడని అంతా భావించారు. కానీ చెడు అలవాట్ల కారణంగా అతడి కెరీర్‌ ఆశించిన రీతిలో సాగలేదు.

ఇవి కూడా చదవండి:

శుభ్‌మన్ గిల్ గాయంపై స్పందించిన టీమిండియా

నేను చేయాల్సిన పని మిగిలే ఉంది.. రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు

Updated Date - Sep 27 , 2026 | 02:55 AM