సచిన్, కోహ్లీలను మించిపోతాడు!
ABN , Publish Date - Jun 13 , 2026 | 01:44 AM
చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీపై దక్షిణాఫ్రికా దిగ్గజ పేసర్ డేల్ స్టెయిన్ ప్రశంసల జల్లు కురిపించాడు. ఈ 15 ఏళ్ల కుర్రాడు...
వైభవ్ సూర్యవంశీపై స్టెయిన్
బెంగళూరు: చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీపై దక్షిణాఫ్రికా దిగ్గజ పేసర్ డేల్ స్టెయిన్ ప్రశంసల జల్లు కురిపించాడు. ఈ 15 ఏళ్ల కుర్రాడు భవిష్యత్‌లో సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీలను మించి రాణిస్తాడని స్టెయిన్ సంచలన జోస్యం చెప్పాడు. ‘వైభవ్ వండర్ బాయ్. భారత క్రికెట్‌కు ఖజానా లాంటివాడు. మీరంతా అతడిని సచిన్, కోహ్లీలతో పోలుస్తున్నారు. కానీ, వైభవ్ ఇదే తరహా ప్రదర్శన కొనసాగిస్తే కెరీర్ ముగిసేసరికి వాళ్లిద్దరినీ మించిపోతాడు. అయితే, ఆ పిల్లాడు ఒత్తిడికి లోనవకుండా, చెడు ప్రభావాలకు గురవకుండా చూసుకోవాల్సిన బాధ్యత బీసీసీఐపై ఉంది’ అని స్టెయిన్ చెప్పుకొచ్చాడు.
ఇవి కూడా చదవండి:
అంతర్జాతీయ క్రికెట్‌కు కేన్ విలియమ్సన్ వీడ్కోలు