Share News

టీజీ20 ఆరంభం అదిరె!

ABN , Publish Date - Jun 22 , 2026 | 05:45 AM

హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) నిర్వహిస్తున్న టీజీ20 లీగ్‌ ఉప్పల్‌ స్టేడియంలో ఆదివారం...

 టీజీ20 ఆరంభం అదిరె!

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) నిర్వహిస్తున్న టీజీ20 లీగ్‌ ఉప్పల్‌ స్టేడియంలో ఆదివారం ఘనంగా మొదలైంది. ప్రారంభోత్సవానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, చాముండేశ్వర్‌నాథ్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. భట్టి విక్రమార్క మాట్లాడుతూ గ్రామీణ క్రికెటర్లను స్టార్లు చేయడానికి హెచ్‌సీఏ ప్రారంభించిన ఈ లీగ్‌ విజయవంతం కావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో లీగ్‌ ప్రచార కర్త, హీరో విజయ్‌ దేవరకొండ, హెచ్‌సీఏ కార్యదర్శి జీవన్‌ రెడ్డి, డీజీపీ సీవీ ఆనంద్‌, హెడ్‌ ఆఫ్‌ ఆపరేషన్స్‌ అంబటి రాయుడు, టీమిండియా క్రికెటర్‌ సిరాజ్‌ తదితరులు పాల్గొన్నారు. ఆ తర్వాత తమన్‌ తన మ్యూజికల్‌ కాన్సర్ట్‌తో అలరించాడు.

ఖమ్మం ఏసెస్‌ శుభారంభం

ఆరంభ మ్యాచ్‌లో అన్విత ఖమ్మం ఏసెస్‌ జట్టు 20 పరుగుల తేడాతో పాలమూరు స్ట్రయికర్స్‌ను ఓడిం చింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఖమ్మం జట్టు 237/5 పరుగులు సాధించింది. ఛేదనలో పాలమూరు 217/6కే పరిమితమైంది.

ఇవి కూడా చదవండి:

ముక్కోణపు సిరీస్ విజేతగా భారత్-ఎ

33 మ్యాచుల్లో 100 గోల్స్ .. 68 ఏళ్ల తర్వాత అత్యంత వేగంగా...

Updated Date - Jun 22 , 2026 | 05:45 AM