గేల్ రికార్డుపై గురి: వైభవ్
ABN , Publish Date - Mar 17 , 2026 | 03:03 AM
టీ20 ఫార్మాట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరుపై టీనేజ్ సంచలనం వైభవ్ సూర్యవంశీ దృష్టి సారించాడు. ఇప్పటికే ఈ రికార్డు (175 రన్స్) విండీస్ స్టార్ క్రిస్ గేల్ పేరిట...
న్యూఢిల్లీ: టీ20 ఫార్మాట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరుపై టీనేజ్ సంచలనం వైభవ్ సూర్యవంశీ దృష్టి సారించాడు. ఇప్పటికే ఈ రికార్డు (175 రన్స్) విండీస్ స్టార్ క్రిస్ గేల్ పేరిట ఉంది. ఆ స్కోరును అధిగమించడమే తన లక్ష్యమని 14ఏళ్ల వైభవ్ చెప్పాడు. ఆదివారం బీసీసీఐ ఈవెంట్‌లో పాల్గొన్న వైభవ్‌కు కామెంటేటర్ హర్షా భోగ్లే మూడు చాయి్‌సలు ఇచ్చాడు. 6 బంతుల్లో 6 సిక్సర్లు, ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ, గేల్ రికార్డు? అని అడిగిన ప్రశ్నలకు వైభవ్ గేల్ స్కోరును దాటాలనుకుంటున్నట్టు చెప్పాడు.
ఇవి కూడా చదవండి:
అక్కడ ఐపీఎల్ మ్యాచ్‌లు.. కర్ణాటక ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
న్యూజిలాండ్‌కు మరో భారీ ఎదురు దెబ్బ!