సూర్యకుమార్ ధనాధన్
ABN , Publish Date - Nov 15 , 2026 | 04:40 AM
టీమిండియా మాజీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (21 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లతో 60 నాటౌట్) ధనాధన్ హాఫ్ సెంచరీతో...
ముంబై చేతిలో హైదరాబాద్ ఓటమి
కోల్‌కతా: టీమిండియా మాజీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (21 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లతో 60 నాటౌట్) ధనాధన్ హాఫ్ సెంచరీతో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ టీ20 టోర్నీలో ముంబై చేతిలో హైదరాబాద్ ఏడు వికెట్లతో ఓటమి పాలైంది. శనివారం ఇక్కడ జరిగిన గ్రూప్ ‘డీ’ పోరులో తొలుత హైదరాబాద్ 20 ఓవర్లలో 172 పరుగులకే ఆలౌటైంది. అభిరథ్ రెడ్డి (35), హిమతేజ (25), కెప్టెన్ మిలింద్ (22) మాత్రమే రాణించారు. ఛేదనలో సూర్యతోపాటు ముషీర్ (51) మెరవడంతో ముంబై 13.1 ఓవర్లలో 174/3 స్కోరు చేసి నెగ్గింది. ఇక, గ్రూప్ ‘సి’ పోరులో ఆంధ్ర జట్టు 43 పరుగుల తేడాతో త్రిపురపై గెలిచింది. తొలుత ఆంధ్ర 20 ఓవర్లలో 141/9 స్కోరు చేయగా.. త్రిపుర 17.2 ఓవర్లలో 98 రన్స్‌కే ఆలౌటైంది.