ఒమన్ విలవిల
ABN , Publish Date - Feb 13 , 2026 | 03:11 AM
శ్రీలంక ఆల్‌రౌండ్ షోకు పసికూన ఒమన్ విలవిల్లాడింది. గురువారం జరిగిన గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు చేతిలో 105 పరుగులతో...
శ్రీలంక ఘన విజయం
పల్లెకెలె : శ్రీలంక ఆల్‌రౌండ్ షోకు పసికూన ఒమన్ విలవిల్లాడింది. గురువారం జరిగిన గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు చేతిలో 105 పరుగులతో చిత్తయింది. తొలుత శ్రీలంక 20 ఓవర్లలో 225/5 స్కోరు చేసింది. పవన్ రత్నాయకే (28 బంతుల్లో 60), కెప్టెన్ షనక (20 బంతుల్లో 50) ఒమన్ బౌలర్లను ఆడేసుకున్నారు. కుశాల్ మెండిస్ (61) బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడాడు. భారీ ఛేదనలో శ్రీలంక బౌలర్ల ధాటికి ఎదురు నిలువలేని ఒమన్ 20 ఓవర్లలో 120/9 స్కోరు చేసి ఓడింది. మహ్మద్ నదీమ్ (53 నాటౌట్), వసీమ్ అలీ (27) మాత్రమే రెండంకెల స్కోరు సాధించారు. పవన్ రత్నాయకే ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు.
సంక్షిప్త స్కోర్లు:
శ్రీలంక: 20 ఓవర్లలో 225/5 (కుశాల్ 61, పవన్ రత్నాయకే 60, షనక 50, జితేన్ రామనంది 2/41);
ఒమన్: 20 ఓవర్లలో 120/9 (నదీమ్ 53 నాటౌట్, తీక్షణ 2/11, చమీర 2/19).