Share News

కళ్లన్నీ విరాట్‌ పైనే!

ABN , Publish Date - May 22 , 2026 | 02:00 AM

భారత జట్టు మాజీ కెప్టెన్‌, ఆర్‌సీబీ స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ మేనియాతో హైదరాబాద్‌ ఊగిపోతోంది....

కళ్లన్నీ విరాట్‌ పైనే!

ఎస్‌ఆర్‌హెచ్ఠ్‌ఆర్‌సీబీహై ఓల్టేజ్‌ పోరు నేడు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): భారత జట్టు మాజీ కెప్టెన్‌, ఆర్‌సీబీ స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ మేనియాతో హైదరాబాద్‌ ఊగిపోతోంది. శుక్రవారం ఉప్పల్‌ స్టేడియంలో బెంగళూరు-హైదరాబాద్‌ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌లో తమ అభిమాన క్రికెటర్‌ను చూసేందుకు ఫ్యాన్స్‌ ఉవ్విళ్లూరుతున్నారు. ఈ సీజన్‌లో ఉప్పల్‌లో ఇదే ఆఖరి మ్యాచ్‌. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉన్న ఎస్‌ఆర్‌హెచ్‌ ఈ మ్యాచ్‌లో గెలిచి, రెండో స్థానానికి ఎగబాకాలని పట్టుదలతో ఉంది. 542 పరుగులతో తమ జట్టు తరఫున అత్యధిక పరుగులు చేసి మంచి ఫామ్‌లో ఉన్న కోహ్లీని నియంత్రించడం ఎస్‌ఆర్‌హెచ్‌కు సవాల్‌ కానుంది. మరో వైపు బంతితో విశేషంగా రాణిస్తున్న భువనేశ్వర్‌ కుమార్‌పై ఎదురుదాడికి దిగేందుకు అభిషేక్‌ శర్మ, ఇషాన్‌ కిషన్‌, క్లాసెన్‌తో కూడిన ఎస్‌ఆర్‌హెచ్‌ టాపార్డర్‌ ప్రత్యేక కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఇరు జట్లు ప్లేఆఫ్స్‌ చేరినందున ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా ఆడే అవకాశముంది.

ఇవి కూడా చదవండి..

అప్పు గొడవ.. కారు బోనెట్‌పై 500 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లిన వ్యక్తి..

రాంచీకి వెళ్లిన ధోని.. చెన్నై ప్లే ఆఫ్స్‌కి చేరితే మళ్లీ వెనక్కి వస్తాడా..

Updated Date - May 22 , 2026 | 02:00 AM