Share News

భారత్‌ జోరుకు బ్రేక్‌

ABN , Publish Date - Jun 22 , 2026 | 05:52 AM

ప్రపంచ కప్‌లో రెండు వరుస విజయాలతో జోరు మీదున్న భారత్‌కు దక్షిణాఫ్రికా బ్రేకులేసింది. మరిజానె కాప్‌ (81 నాటౌట్‌, 2/27) ఆల్‌రౌండ్‌ షోతో అదరగొట్టిన వేళ ఆదివారం జరిగిన...

భారత్‌ జోరుకు బ్రేక్‌

దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి

మాంచెస్టర్‌: ప్రపంచ కప్‌లో రెండు వరుస విజయాలతో జోరు మీదున్న భారత్‌కు దక్షిణాఫ్రికా బ్రేకులేసింది. మరిజానె కాప్‌ (81 నాటౌట్‌, 2/27) ఆల్‌రౌండ్‌ షోతో అదరగొట్టిన వేళ ఆదివారం జరిగిన గ్రూప్‌ ‘ఎ’ మ్యాచ్‌లో ఆరు వికెట్లతో హర్మన్‌ప్రీత్‌ సేనను సఫారీలు ఓడించారు. తొలుత భారత్‌ 20 ఓవర్లలో 158/7 స్కోరు సాధించింది. షఫాలీ వర్మ (31), దీప్తీశర్మ (29), హర్మన్‌ప్రీత్‌ (24) పర్లేదనిపించారు. కాప్‌, షబ్నిమ్‌ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఛేదనలో దక్షిణాఫ్రికా 19.1 ఓవర్లలో 161/4 స్కోరు చేసి నెగ్గింది. బ్రిట్స్‌ (40) సత్తా చాటింది. శ్రీచరణి మూడు వికెట్లు కైవసం చేసుకుంది. కాప్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచింది.

స్కోరుబోర్డు

భారత్‌: మంధాన (బి) కాప్‌ 17, షఫాలీ (సి) జఫ్టా (బి) ఇస్మాయిల్‌ 31, యాస్తిక (ఎల్బీ) ఖాఖ 15, జెమీమా (సి అండ్‌ బి) డిక్లెర్క్‌ 12, హర్మన్‌ (బి) ఇస్మాయిల్‌ 24, దీప్తీశర్మ (సి) కాప్‌ (బి) మ్లాబా 29, రిచా (సి) ఖాఖ (బి) కాప్‌ 15, అరుంధతి రెడ్డి (నాటౌ ట్‌) 6, ప్రేమా రావత్‌ (నాటౌట్‌) 3;ఎక్స్‌ట్రాలు: 6 ; మొత్తం 20 ఓవర్లలో 158/7 ; వికెట్లపతనం: 1-30, 2-54, 3-67, 4-83, 5-116, 6-137, 7-153;బౌలింగ్‌: కాప్‌ 4-0-27-2, షబ్నిమ్‌4-0-28-2, ట్రయన్‌ 2-0-23-0, మ్లాబా 4-0-33-1, ఖాఖ 4-0-31-1, డిక్లెర్క్‌ 2-0-16-1.

దక్షిణాఫ్రికా: వోల్వార్ట్‌ (సి అండ్‌ బి) శ్రీచరణి 20, బ్రిట్స్‌ (సి) శ్రీచరణి (బి) షఫాలీ 40, డెర్క్‌సెన్‌ (బి) శ్రీచరణి 0, కాప్‌ (నాటౌట్‌) 81, డిక్లెర్క్‌ (బి) శ్రీచరణి 5, ట్రయన్‌ (నాటౌ ట్‌) 10;ఎక్స్‌ట్రాలు: 5 ; మొత్తం 19.1 ఓవర్లలో 161/4 ; వికెట్లపతనం: 1-25, 2-25, 3-122, 4-137 ; బౌలింగ్‌: షఫాలీ 4-0-22-1, నందినీ శర్మ 2.1-0-17-0, అరుంధతి రెడ్డి 3-0-29-0, శ్రీచరణి 4-1-24-3, ప్రేమా రావత్‌ 2-0-21-0, దీప్తీశర్మ 4-0-44-0.


హర్మన్‌ @:200

భారత జట్టు కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ అరుదైన చరిత్ర సృష్టించింది. పురుషులు, మహిళల్లో 200 టీ20లు ఆడిన ఏకైక క్రికెటర్‌గా ఆమె ఘనత వహించింది. 2009 మార్చిలో పాకిస్థాన్‌పై వన్డేతో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన కౌర్‌..అదే ఏడాది జూన్‌లో తొలి టీ20 ఆడింది. దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌కు ముందు ‘200’ అని రాసి ఉన్న ప్రత్యేక జెర్సీతోపాటు క్యాప్‌ను జట్టు హెడ్‌ కోచ్‌ అమోల్‌ మజుందార్‌, వైస్‌-కెప్టెన్‌ మంధాన కలిసి కౌర్‌కు అందజేశారు. ఇంకా..హర్మన్‌కిది 10వ టీ20 వరల్డ్‌ కప్‌ కావడం విశేషం. మహిళల్లో సుజీ బేట్స్‌ (న్యూజిలాండ్‌) 184 మ్యాచ్‌లతో రెండో స్థానంలో ఉండగా, ఐర్లాండ్‌కు చెందిన పాల్‌ స్టిర్లింగ్‌ (163 మ్యాచ్‌లు) పురుషుల్లో టాప్‌లో నిలిచాడు.

ఇవి కూడా చదవండి:

ముక్కోణపు సిరీస్ విజేతగా భారత్-ఎ

33 మ్యాచుల్లో 100 గోల్స్ .. 68 ఏళ్ల తర్వాత అత్యంత వేగంగా...

Updated Date - Jun 22 , 2026 | 05:52 AM