Share News

న్యూజిలాండ్‌ భారీ గెలుపు

ABN , Publish Date - Jun 22 , 2026 | 05:40 AM

మాట్‌ హెన్రీ (6/29) విజృంభించడంతో.. రెండో టెస్ట్‌లో న్యూజిలాండ్‌ 253 పరుగుల భారీతేడాతో ఇంగ్లండ్‌ను మట్టి కరిపించింది. మూడు టెస్ట్‌ల...

న్యూజిలాండ్‌ భారీ గెలుపు

  • హెన్రీకి 6 వికెట్లు ఫ రెండో టెస్ట్‌లో ఇంగ్లండ్‌ చిత్తు

లండన్‌: మాట్‌ హెన్రీ (6/29) విజృంభించడంతో.. రెండో టెస్ట్‌లో న్యూజిలాండ్‌ 253 పరుగుల భారీతేడాతో ఇంగ్లండ్‌ను మట్టి కరిపించింది. మూడు టెస్ట్‌ల సిరీ్‌సను 1-1తో సమం చేసింది. 463 పరుగుల లక్ష్య ఛేదనలో.. ఆటకు ఐదో రోజైన ఆదివారం ఓవర్‌నైట్‌ స్కోరు 182/5తో రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ఇంగ్లండ్‌ 209 పరుగులకే కుప్పకూలింది. హెన్రీ దెబ్బకు నిన్నటి స్కోరుకు కేవలం 27 పరుగులు మాత్రమే జోడించి మిగతా 5 వికెట్లు చేజార్చుకొంది. హెన్రీ తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు సాధించాడు. న్యూజిలాండ్‌ 391, 362 స్కోర్లు చేయగా.. ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 291 పరుగులకు ఆలౌటైంది.

ఇవి కూడా చదవండి:

ముక్కోణపు సిరీస్ విజేతగా భారత్-ఎ

33 మ్యాచుల్లో 100 గోల్స్ .. 68 ఏళ్ల తర్వాత అత్యంత వేగంగా...

Updated Date - Jun 22 , 2026 | 05:40 AM