ధోనీ వీడ్కోలు తీసుకున్నాడా?
ABN , Publish Date - May 19 , 2026 | 01:20 AM
రికార్డుస్థాయిలో ఐదుసార్లు చెన్నై సూపర్‌కింగ్స్ (సీఎస్కే)కు ఐపీఎల్ ట్రోఫీ అందించిన మహేంద్రసింగ్ ధోనీకి ఆ జట్టుతో ప్రస్థానం ముగిసినట్టేనా? ఈ సూపర్ స్టార్ ఆటగాడు...
చెన్నై: రికార్డుస్థాయిలో ఐదుసార్లు చెన్నై సూపర్‌కింగ్స్ (సీఎస్కే)కు ఐపీఎల్ ట్రోఫీ అందించిన మహేంద్రసింగ్ ధోనీకి ఆ జట్టుతో ప్రస్థానం ముగిసినట్టేనా? ఈ సూపర్ స్టార్ ఆటగాడు లీగ్ నుంచి నిష్క్రమించినట్టేనా? సోమవారం సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్‌తో సీఎస్కే జట్టు తమ సొంత మైదానం చెపాక్ స్టేడియంలో చివరి మ్యాచ్ ఆడిన నేపథ్యంలో మహీని ఆటగాళ్లంతా ఫేర్‌వెల్ తరహాలో అభినందించడం పై ఊహాగానాలకు ఊతమిస్తోంది. ఈ సీజన్‌లో ఇప్పటిదాకా ఒక్క మ్యాచ్ కూడా ఆడని ధోనీ.. చెన్నైలో జరిగే ఆఖరిపోరులోనైనా బరిలోకి దిగుతాడని అభిమానులంతా ఎదురుచూశారు. కానీ, ఎప్పటిలాగే ఈ మ్యాచ్‌కూ దూరమైన మహీ, జట్టుతో కలిసి స్టేడియంలో మాత్రం సందడి చేశాడు. తొలి ఇన్నింగ్స్ ముగిసిన అనంతరం జట్టుతో గ్రూప్ ఫొటో కోసం ధోనీ మైదానంలోకి అడుగుపెట్టాడు. అంతే.. ఒక్కసారిగా స్టేడియం మొత్తం హోరెత్తిపోయింది. ఆ సమయంలో ఒకింత భావోద్వేగానికి గురైనట్టుగా కనిపించిన మహీ.. సహచరులతో కలిసి ఫొటో సెషన్‌లో పాల్గొన్నాడు. అనంతరం స్టేడియంలోని అభిమానులకు చేతులూపుతూ భారంగా డ్రెస్సింగ్ రూమ్ వైపు కదిలాడు.
ఈ వార్తలనూ చదవండి:
యూఏఈ అణువిద్యుత్ కేంద్రంపై డ్రోన్ దాడి.. ఖండించిన భారత్
త్వరపడండి.. లేకపోతే మీకేమీ మిగలదు.. ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్