ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే..
ABN , Publish Date - May 22 , 2026 | 02:02 AM
ఐపీఎల్‌తో ధోనీది విడదీయరాని బంధం. 18 ఏళ్ల మెగా లీగ్‌లో రెండు సంవత్సరాలు మినహాయిస్తే 16 ఏళ్లు చెన్నై సూపర్ కింగ్స్‌కే ఆడాడు. ఈసారి లీగ్ ప్రారంభానికి ముందు...
18 ఏళ్లలో ధోనీకిదే తొలిసారి
అహ్మదాబాద్: ఐపీఎల్‌తో ధోనీది విడదీయరాని బంధం. 18 ఏళ్ల మెగా లీగ్‌లో రెండు సంవత్సరాలు మినహాయిస్తే 16 ఏళ్లు చెన్నై సూపర్ కింగ్స్‌కే ఆడాడు. ఈసారి లీగ్ ప్రారంభానికి ముందు అయిన పిక్క గాయంతో రెండు వారాలపాటు అతడు పోటీలకు దూరంగా ఉంటున్నట్టు సీఎస్కే ప్రకటించింది. కానీ ఐపీఎల్ ముగింపు దశకు వచ్చినా ఽ44 ఏళ్ల ధోనీ ఒక్క మ్యాచ్ కూడా ఆడకపోవడం అతడి ఫ్యాన్స్‌ను తీవ్ర నిరాశకు గురి చేసింది. అయితే పిక్క గాయం నుంచి కోలుకోకపోవడంవల్లే మహీ మ్యాచ్‌లు ఆడడంలేదని వారు భావిస్తుండగా..తాజాగా అతడి బొటన వేలికి గాయమైందట. ఈ విషయాన్ని చెన్నై బ్యాటింగ్ కోచ్ మైకేల్ హస్సీ వెల్లడించాడు. అంతేకాదు అతడు స్వస్థలం రాంచీ వెళ్లిపోయినట్టు కూడా తెలిపాడు. అయితే సోమవారం చెన్నైలో సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్ అనంతరం మహీని ఆటగాళ్లంతా ఫేర్‌వెల్ తరహాలో అభినందించడంతో అతడు లీగ్‌కు గుడ్‌బై చెబుతున్నట్టు వార్తలొచ్చాయి. ఏదేమైనా దిగ్గజ బ్యాటర్ ధోనీ ఆడకుండానే ఒక పూర్తి ఐపీఎల్ ముగిసింది.
ఇవి కూడా చదవండి..
అప్పు గొడవ.. కారు బోనెట్‌పై 500 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లిన వ్యక్తి..
రాంచీకి వెళ్లిన ధోని.. చెన్నై ప్లే ఆఫ్స్‌కి చేరితే మళ్లీ వెనక్కి వస్తాడా..