సిరాజ్‌కు విశ్రాంతి
ABN , Publish Date - Jun 10 , 2026 | 03:34 AM
పని ఒత్తిడి కారణంగా ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనల నుంచి పేసర్ సిరాజ్‌కు విశ్రాంతినిచ్చారు. అతడి స్థానంలో మరో పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ జట్టులో చేరనున్నాడు. ఈనెల 26న...
ఇంగ్లండ్ టూర్‌కు ప్రసిద్ధ్
ముంబై: పని ఒత్తిడి కారణంగా ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనల నుంచి పేసర్ సిరాజ్‌కు విశ్రాంతినిచ్చారు. అతడి స్థానంలో మరో పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ జట్టులో చేరనున్నాడు. ఈనెల 26న మొదలయ్యే ఈ టూర్‌లో భాగంగా రెండు దేశాల్లో భారత్ మొత్తం 7 టీ20లు ఆడనుంది. ఇందుకోసం శ్రేయాస్ నేతృత్వంలో జట్టును గత శనివారమే బీసీసీఐ ప్రకటించింది. ఇందులో మొదట సిరాజ్‌కు చోటిచ్చి ఆసియాక్‌పనకు విశ్రాంతినిస్తున్నట్టు ప్రకటించారు. అయితే ఐపీఎల్‌లో ఫైనల్ వరకు ఆడిన సిరాజ్‌ను వెంటనే ఈ సిరీ్‌సలలో ఆడించడం సరికాదని బోర్డు భావించింది. ఇప్పటికే అతను అఫ్ఘాన్‌తో ముగిసిన ఏకైక టెస్టులోనూ బరిలోకి దిగాడు. అయితే ఇంగ్లండ్‌తో వచ్చేనెల 14 నుంచి జరిగే 3 వన్డేల్లో సిరాజ్‌ను ఆడించే చాన్సుంది. ఈ ఏడాది సిరాజ్ 6 లిస్ట్ ‘ఎ’, 18 టీ20, 3 ఫస్ట్ క్లాస్, న్యూజిలాండ్‌తో 3 వన్డేలు, విజయ్ హజారే, రంజీ మ్యాచ్‌ల్లోనూ బరిలోకి దిగడంతో అధిక పనిఒత్తిడి పడకూడదనే విశ్రాంతినిచ్చారు.