నా కల నిజమైంది
ABN , Publish Date - Mar 17 , 2026 | 06:03 AM
అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్ ఆధిపత్యాన్ని చూడాలన్న తన కల నెరవేరిందని టీమిండియా మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ తెలిపింది. ‘గత రెండు మూడు సంవత్సరాలుగా మన పురుషులు, మహిళల జట్లు....
మిథాలీ రాజ్
న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్ ఆధిపత్యాన్ని చూడాలన్న తన కల నెరవేరిందని టీమిండియా మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ తెలిపింది. ‘గత రెండు మూడు సంవత్సరాలుగా మన పురుషులు, మహిళల జట్లు, అండర్-19 బాలబాలికల జట్లు అంతర్జాతీయ క్రికెట్‌పై ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. మాజీ క్రికెటర్‌గా దీనికి నేను ఎంతో గర్వపడుతున్నా’ అని బీసీసీఐ నమన్ అవార్డుల కార్యక్రమంలో మాట్లాడుతూ మిథాలీ పేర్కొంది. మిథాలీ రాజ్, రోజర్ బిన్నీ, రాహుల్ ద్రవిడ్.. సీకే నాయుడు జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. భారత క్రికెట్..ముఖ్యంగా మహిళల క్రికెట్ ఇంతగా పరివర్తన చెందడంలో బీసీసీఐ మాజీ కార్యదర్శి, ప్రస్తుత ఐసీసీ అధ్యక్షుడు జై షా పాత్ర కీలకమైనదని మిథాలీ చెప్పింది. ‘మహిళా క్రికెట్‌కు అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు తీసుకు రావడంతో ఆయన దూరదృష్టి, నిబద్ధత వెలకట్టలేనివి’ అని ప్రశంసించింది.
ఇవి కూడా చదవండి:
అక్కడ ఐపీఎల్ మ్యాచ్‌లు.. కర్ణాటక ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
న్యూజిలాండ్‌కు మరో భారీ ఎదురు దెబ్బ!