14న కుల్దీప్ పెళ్లి
ABN , Publish Date - Mar 11 , 2026 | 03:17 AM
టీమిండియా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ త్వరలో పెళ్లి పీటలెక్కనున్నాడు. తన చిన్ననాటి స్నేహితురాలు వన్షికను ఈనెల 14న...
న్యూఢిల్లీ: టీమిండియా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ త్వరలో పెళ్లి పీటలెక్కనున్నాడు. తన చిన్ననాటి స్నేహితురాలు వన్షికను ఈనెల 14న వివాహమాడనున్నాడు. ఉత్తరాఖండ్‌లోని ముస్సోరి రిసార్ట్‌లో ఈ వేడుక జరగనుంది. ఈనెల 17న లఖ్‌నవూలో రిసెప్షన్‌కు ఏర్పాట్లు చేస్తున్నారు. గతేడాది జూన్ 14న వన్షికతో కుల్దీప్ నిశ్చితార్థం జరిగింది. వీరి పెళ్లి గత నవంబర్‌లోనే జరగాల్సివున్నా.. టీ20 ప్రపంచకప్ సన్నాహకాల కారణంగా కుల్దీప్ ఆ వేడుకను వాయిదా వేసుకున్నాడు.
ఇవి కూడా చదవండి:
డారిల్ మిచెల్‌తో గొడవ.. అర్ష్‌దీప్ సింగ్‌పై చర్యలు తీసుకున్న ఐసీసీ