Share News

హైదరాబాద్‌కు ఝలక్‌

ABN , Publish Date - Jul 10 , 2026 | 05:05 AM

టీజీ20లో ఓటమన్నదే లేకుండా అజేయంగా దూసుకెళ్తున్న హైదరాబాద్‌ ఈ-చాంపియన్స్‌ జట్టు జోరుకు బ్రేక్‌ పడింది. గురువారం జరిగిన క్వాలిఫయర్‌ 1లో...

హైదరాబాద్‌కు ఝలక్‌

టీజీ20 ఫైనల్‌కు ఖమ్మంఫ రంగారెడ్డి అవుట్‌

హైదరాబాద్‌: టీజీ20లో ఓటమన్నదే లేకుండా అజేయంగా దూసుకెళ్తున్న హైదరాబాద్‌ ఈ-చాంపియన్స్‌ జట్టు జోరుకు బ్రేక్‌ పడింది. గురువారం జరిగిన క్వాలిఫయర్‌ 1లో అన్విత ఖమ్మం ఏసెస్‌ 10 రన్స్‌తో హైదరాబాద్‌కు షాకిచ్చి ఫైనల్‌ చేరింది. మొదట ఖమ్మం 20 ఓవర్లలో 6 వికెట్లకు 200 రన్స్‌ చేసింది. ఛేదనలో హైదరాబాద్‌ 20 ఓవర్లలో 190/8 స్కోరుకే పరిమితమైంది. ఫైనల్లో బెర్త్‌ కోసం క్వాలిఫయర్‌ 2 విజేత కరీంనగర్‌ డైమండ్స్‌తో హైదరాబాద్‌ తలపడనుంది. క్వాలిఫయర్‌ 2 పోరులో కరీంనగర్‌ 75 రన్స్‌తో రంగారెడ్డి రైజర్స్‌పై గెలిచింది. తొలుత కరీంనగర్‌.. తన్మయ్‌ (137) సెంచరీతో 20 ఓవర్లలో 7 వికెట్లకు 238 రన్స్‌ చేసింది. భారీస్కోరు ఛేదనలో రంగారెడ్డి 16.3 ఓవర్లలో 163 రన్స్‌ ఆలౌటై టోర్నీ నుంచి నిష్క్రమించింది.

ఈ వార్తలనూ చదవండి:

రోజంతా నిలకడగా రాణించి, చివరికి లాభాల్లోనే ముగిసిన సూచీలు

స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే..

Updated Date - Jul 10 , 2026 | 05:05 AM