Share News

ఐసీసీ ట్రోఫీని చోరీ చేస్తారా ?

ABN , Publish Date - Mar 17 , 2026 | 06:00 AM

బంగ్లాదేశ్‌తో మూడు వన్డేల సిరీ్‌సలో పాకిస్థాన్‌ ఓటమిని ఆ జట్టు మాజీ కీపర్‌, బ్యాటర్‌ కమ్రాన్‌ అక్మల్‌ తీవ్రస్థాయిలో ఎద్దేవా చేశాడు. జట్టు దారుణ వైఫల్యాలకు పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు...

ఐసీసీ ట్రోఫీని చోరీ చేస్తారా ?

పాక్‌ వైఫల్యాలపై కమ్రన్‌ సెటైర్‌

కరాచీ: బంగ్లాదేశ్‌తో మూడు వన్డేల సిరీ్‌సలో పాకిస్థాన్‌ ఓటమిని ఆ జట్టు మాజీ కీపర్‌, బ్యాటర్‌ కమ్రాన్‌ అక్మల్‌ తీవ్రస్థాయిలో ఎద్దేవా చేశాడు. జట్టు దారుణ వైఫల్యాలకు పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) చైర్మన్‌ మొహిసిన్‌ నక్వీకి ముడిపెడుతూ సెటైర్లు వేశాడు. నిరుడు భారత జట్టు ఆసియా కప్‌ గెలిచింది. కానీ తన నుంచి ట్రోఫీ అందుకొనేందుకు టీమిండియా నిరాకరించడంతో అప్పటినుంచి నక్వీ ట్రోఫీని భారత్‌ పంపకుండా పీసీబీ వద్దే ఉంచుకున్నాడు. దాంతో నక్వీ తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈక్రమంలో.. పాకిస్థాన్‌ వరుస ఓటములపై అక్మల్‌ స్పందిస్తూ ‘మ్యాచ్‌ల్లో జట్లను ఓడించలేకపోతే చోరీ చేసి ఐసీసీ ట్రోఫీని ఇంటికి తెచ్చుకుంటారా’ అని ఎగతాళి చేశాడు.

ఇవి కూడా చదవండి:

అక్కడ ఐపీఎల్ మ్యాచ్‌లు.. కర్ణాటక ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

న్యూజిలాండ్‌కు మరో భారీ ఎదురు దెబ్బ!

Updated Date - Mar 17 , 2026 | 06:00 AM