నా రికార్డు బద్దలుకొట్టేది సూర్యవంశీనే!
ABN , Publish Date - Aug 07 , 2026 | 04:11 AM
టీ20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్‌గా తన రికార్డును బద్దలు కొట్టే అవకాశం వైభవ్ సూర్యవంశీకి ఉందని...
లండన్: టీ20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్‌గా తన రికార్డును బద్దలు కొట్టే అవకాశం వైభవ్ సూర్యవంశీకి ఉందని ఇంగ్లండ్ ఆటగాడు జోస్ బట్లర్ అన్నాడు. ది హండ్రెడ్ టోర్నీలో వెల్ష్ ఫైర్‌తో మ్యాచ్‌లో మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ తరఫున బట్లర్ 20 బంతుల్లో 51 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో టీ20ల్లో అత్యధికంగా 14,803 పరుగులు సాధించిన వెస్టిండీస్ మాజీ ప్లేయర్ పొలార్డ్ రికార్డును బట్లర్ (14,844 పరుగులు) బద్దలుకొట్టాడు. అయితే, భవిష్యత్తులో తన రికార్డును ఎవరో ఒకరు అధిగమిస్తారని బట్లర్ అన్నాడు. అది వైభవ్ సూర్యవంశీ కావచ్చని చెప్పాడు.