Share News

నానమ్మకు బంగారు గాజులు కానుకగా ఇచ్చిన క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి

ABN , Publish Date - Jun 25 , 2026 | 08:36 PM

ప్రముఖ భారత క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి తన నానమ్మకు బంగారు గాజులు కానుకగా ఇచ్చారు. ఆమెకు స్వయంగా బంగారు గాజులు తొడిగి ఆశీర్వాదం తీసుకున్నారు.

నానమ్మకు బంగారు గాజులు కానుకగా ఇచ్చిన క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి
Nitish Kumar Reddy

ఇంటర్‌నెట్ డెస్క్: ప్రముఖ భారత క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి తన నానమ్మకు బంగారు గాజులు కానుకగా ఇచ్చారు. ఆమెకు స్వయంగా బంగారు గాజులు తొడిగి ఆశీర్వాదం తీసుకున్నారు. నితీష్ కుమార్ రెడ్డి నాలుగు సంవత్సరాల తర్వాత స్వస్థలం విశాఖపట్నం జిల్లా, గాజువాకలోని తుంగ్లం గ్రామానికి వెళ్లారు. ఐపీఎల్‌లో సెలెక్ట్ అయిన తర్వాత తొలిసారిగా స్వగ్రామం రావడం తనకు ఎంతో ఆనందంగా ఉందని నితీష్ అన్నారు.


తన చిన్ననాటి జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ సంతోషం వ్యక్తం చేశారు. తను ఈ రోజు ఈ స్థాయికి రావడానికి తల్లిదండ్రులు పాత్ర ఎంతో ఉందని అన్నారు. విరాట్ కోహ్లీ స్ఫూర్తితో క్రికెట్‌లోకి వచ్చానని చెప్పారు. భారత క్రికెట్ జట్టులో తను అందించ వలసిన సేవలు ఎంతో ఉన్నాయని పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి

బీసీ గురుకులాల బలోపేతానికి కీలక నిర్ణయాలు

పారిశ్రామిక, వాణిజ్య ఎల్‌పీజీ వినియోగదారులకు భారీ ఉపశమనం

Updated Date - Jun 25 , 2026 | 09:48 PM