మన కుర్రాళ్లదే సిరీస్
ABN , Publish Date - Jul 24 , 2026 | 02:28 AM
శ్రీలంక అండర్-19తో జరిగిన రెండు అనధికార టెస్టుల సిరీ్‌సను భారత కుర్రాళ్లు 1-0తో గెలుచుకున్నారు....
శ్రీలంక అండర్-19తో రెండో టెస్టు గెలుపు
కొలంబో: శ్రీలంక అండర్-19తో జరిగిన రెండు అనధికార టెస్టుల సిరీ్‌సను భారత కుర్రాళ్లు 1-0తో గెలుచుకున్నారు. 472 పరుగుల ఛేదనలో బరిలోకి దిగిన శ్రీలంక ఆట ఆఖరి రోజు గురువారం తమ రెండో ఇన్నింగ్స్‌లో 260 పరుగులకు కుప్పకూలింది. దీంతో భారత్ 211 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. సెనుజ (64), విమత్ (64) సెత్మిక (42) రాణించారు. రోహిత్ యాదవ్‌కు నాలుగు, చిగురుపాటి సుభాష్‌కు మూడు వికెట్లు దక్కాయి. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 411, రెండో ఇన్నింగ్స్‌లో 208/3 డిక్లేర్, శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 148 పరుగులు చేశాయి.