శ్రీలంక టూర్‌కు భారత్
ABN , Publish Date - Jul 03 , 2026 | 01:45 AM
శ్రీలంక పర్యటనలో భారత జట్టు రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది. ఆగస్టు 15 నుంచి 27 వరకు జరిగే ఈ మ్యాచ్‌ల షెడ్యూల్‌ను గురువారం శ్రీలంక క్రికెట్ (ఎస్‌ఎల్‌సీ) వెల్లడించింది...
వచ్చే నెల్లో రెండు టెస్టుల సిరీస్
కొలంబో: శ్రీలంక పర్యటనలో భారత జట్టు రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది. ఆగస్టు 15 నుంచి 27 వరకు జరిగే ఈ మ్యాచ్‌ల షెడ్యూల్‌ను గురువారం శ్రీలంక క్రికెట్ (ఎస్‌ఎల్‌సీ) వెల్లడించింది. వరల్డ్ టెస్టు చాంపియన్‌షి్‌ప (డబ్ల్యూటీసీ)లో భాగంగా జరిగే ఈ సిరీ్‌సకు గాలె, కొలంబో వేదికలు కానున్నాయి. ఆగస్టు 23 నుంచి రెండో టెస్టు జరుగనుంది. గతంలో భారత జట్టు రెండుసార్లు డబ్ల్యూటీసీ ఫైనల్స్ ఆడినా విజేత కాలేకపోయింది. ప్రస్తుతం పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతోంది. 2017లో చివరిసారి టీమిండియా లంకలో టెస్టు సిరీస్ ఆడగా.. అప్పట్లో 3-0తో క్లీన్‌స్వీ్‌ప చేసింది.
ఈ వార్తలనూ చదవండి:
వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఖాయమా.. జట్టు కూర్పు ఇలా ఉంటుందా..
మెస్సీకి ఒక న్యాయం.. బలోగన్‌కు మరో న్యాయమా.. అభిమానుల ఆగ్రహం..