సారాంశ్‌కు చోటు
ABN , Publish Date - Jul 29 , 2026 | 04:33 AM
శ్రీలంకతో జరిగే రెండు టెస్టుల సిరీస్ కోసం భారత జట్టును ప్రకటించారు. ఇందులో స్పిన్ ఆల్‌రౌండర్ సారాంశ్ జైన్‌కు తొలిసారిగా చోటు కల్పించారు. 15 మందితో కూడిన ఈ బృందానికి..
బుమ్రా, జడేజా ఆగమనం జూ శ్రీలంకతో సిరీ్‌సకు భారత టెస్టు జట్టు
ముంబై: శ్రీలంకతో జరిగే రెండు టెస్టుల సిరీస్ కోసం భారత జట్టును ప్రకటించారు. ఇందులో స్పిన్ ఆల్‌రౌండర్ సారాంశ్ జైన్‌కు తొలిసారిగా చోటు కల్పించారు. 15 మందితో కూడిన ఈ బృందానికి శుభ్‌మన్ గిల్ నేతృత్వం వహించనున్నాడు. ఆగస్టు 15న గాలెలో ఈ సిరీస్ మొదలవనుంది. వాషింగ్టన్ సుందర్ గాయంతో తొలి టెస్టుకు దూరం కావడం తో, అతడి స్థానంలో బ్యాక్‌పగా 33 ఏళ్ల సారాంశ్‌ను తీసుకున్నారు. దేశవాళీల్లో మధ్యప్రదేశ్ తరఫున అతడు నిలకడగా రాణించాడు. ఇక అఫ్ఘాన్‌తో టెస్టుకు విశ్రాంతి తీసుకున్న రవీం ద్ర జడేజా జట్టులో చేరనున్నాడు. అలాగే స్టార్ పేసర్ బుమ్రా, సాయి సుదర్శన్‌లను కూడా ఎంపిక చేసినప్పటికీ.. వారి మ్యాచ్ ఫిట్‌నె్‌సపై సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్సీ స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది. గాయంతో బాధపడుతున్న తెలుగు ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్‌ను పరిగణనలోకి తీసుకోలేదు.
జట్టు ఇదే..
గిల్ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), యశస్వీ జైస్వాల్, రిషభ్ పంత్, జురెల్, సాయి సుదర్శన్, జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుథర్, బుమ్రా, సి రాజ్, ప్రసిద్ద్, గుర్నూర్, దేవ్‌దత్ పడిక్కళ్, సారాంశ్ జైన్.
తండ్రి కల నెరవేర్చాడు
మధ్యప్రదేశ్‌కు చెందిన సారాంశ్ జైన్ తొలిసారిగా టీమిండియాకు ఎంపికై తన తండ్రి కలను నెరవేర్చాడు. 61 ఏళ్ల సుబోధ్ గతంలో ఎంపీ తరఫున రంజీ ట్రోఫీలో ఆడాడు. అందరిలాగే జాతీయ జట్టుకు ఆడాలని కోరుకున్నాడు. కానీ అది నెరవేరలేదు. అయితే కుమారుడు సారాంశ్ రూపంలో తన కల నెరవేరనున్నట్టు తెలిపాడు. మరోవైపు 12 ఏళ్ల క్రితం ఆసీస్ టూర్‌లో ఉన్నప్పుడు తన తండ్రికి క్యాన్సర్ సోకిందని, అయితే తన ఆట దెబ్బతినకూడదని ఆ విషయాన్ని భారత్ వచ్చే వరకు తనతో చెప్పకుండా దాచారని గతంలో సారాంశ్ జైన్ గుర్తుచేసుకున్నాడు.
ఇవి కూడా చదవండి..
ఏదో మంచి జరిగే అవకాశం ఉంది.. ఇరాన్‌తో చర్చలపై ట్రంప్ ఆశాభావం..
స్వల్పంగా పెరిగిన పసిడి ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..