Share News

భారత్‌ క్లీన్‌స్వీప్

ABN , Publish Date - Jul 27 , 2026 | 03:51 AM

ఎలాంటి సంచలనాలకు తావీయకుండా జింబాబ్వే పర్యటనను టీమిండియా ముగించింది. స్థాయికి తగ్గ ఆటతీరుతో ప్రత్యర్థిని వణికించిన శ్రేయాస్‌ సేన 3-0తో సిరీ్‌సను క్లీన్‌స్వీ్‌ప చేసింది..

భారత్‌ క్లీన్‌స్వీప్

3-0తో సిరీస్‌ కైవసం జూచెలరేగిన వైభవ్‌

చివరి టీ20లోనూ జింబాబ్వే చిత్తు

హరారే: ఎలాంటి సంచలనాలకు తావీయకుండా జింబాబ్వే పర్యటనను టీమిండియా ముగించింది. స్థాయికి తగ్గ ఆటతీరుతో ప్రత్యర్థిని వణికించిన శ్రేయాస్‌ సేన 3-0తో సిరీ్‌సను క్లీన్‌స్వీ్‌ప చేసింది. ఐర్లాండ్‌, ఇంగ్లండ్‌లపై వైట్‌వా్‌షలకు గురైన మన జట్టుకు ఈ గెలుపు అతిపెద్ద ఊరట. అటు శ్రేయాస్‌కు కెప్టెన్‌గా ఇది తొలి సిరీస్‌ విజయం. ఇక 15 ఏళ్ల డాషింగ్‌ బ్యాటర్‌ వైభవ్‌ సూర్యవంశీ (49 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 81) కెరీర్‌లో రెండో హాఫ్‌ సెంచరీతో అదరగొట్టాడు. ఫలితంగా.. ఆదివారం జరిగిన ఈ మూడో టీ20లో భారత్‌ 35 పరుగుల తేడాతో నెగ్గింది. ముందుగా భారత్‌ 20 ఓవర్లలో 5 వికెట్లకు 192 పరుగులు చేసింది. బ్రాడ్‌ ఇవాన్స్‌కు 2 వికెట్లు దక్కాయి. ఛేదనలో జింబాబ్వే 20 ఓవర్లలో 7 వికెట్లకు 157 పరుగులకే పరిమితమైంది. రియాన్‌ బర్ల్‌ (43 బంతుల్లో 5 ఫోర్లతో 54 నాటౌట్‌) ఆకట్టుకున్నాడు. మయాంక్‌కు 3, యష్‌కు 2 వికెట్లు లభించాయి. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’, ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీ్‌స’గా వైభవ్‌ సూర్యవంశీ నిలిచాడు.

అదే తడబాటు: ఈ పిచ్‌పై క్లిష్టమైన ఛేదనలో జింబాబ్వే ఎప్పటిలాగే తడబడింది. మిడిలార్డర్‌లో రియాన్‌ బర్ల్‌ ఒక్కడే చివరికంటా నిలిచి భారత బౌలర్లను ఎదుర్కొన్నాడు. ఇక పేసర్‌ మయాంక్‌ మరోసారి ఇన్నింగ్స్‌ తొలి బంతికే ఓపెనర్‌ బెనెట్‌ (0) వికెట్‌ తీశాడు. పవర్‌ప్లేలోనే మూడు వికెట్లు కోల్పోగా.. బర్ల్‌ ఆదుకునే ప్రయత్నం చేశాడు. ఐదో వికెట్‌కు మధెవెరెతో కలిసి 60 పరుగులు జోడించాడు. 42 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసిన బర్ల్‌కు ఇతర బ్యాటర్ల నుంచి సహకారం లభించలేదు.

వైభవ్‌ నిలకడగా..: టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ ఇన్నింగ్స్‌లో సూర్యవంశీ ఈసారి షాట్ల ఎంపికలో జాగరూకతతో వ్యవహరించాడు. అయినా కొన్ని కళ్లు చెదిరే షాట్లతోనూ ఆకట్టుకున్నాడు. అయితే మరో ఓపెనర్‌ అభిషేక్‌ (2) వరుసగా ఆరో మ్యాచ్‌లోనూ నిరాశపర్చాడు. ఈ సిరీ్‌సలో వరుసగా మూడోసారి అతను పేసర్‌ ముజరబానికే చిక్కడం గమనార్హం. అయితే 31 బంతుల్లో అర్ధసెంచరీ సాధించిన వైభవ్‌ మాత్రం ఇషాన్‌ (29)తో రెండో వికెట్‌కు 75 పరుగులు.. కెప్టెన్‌ శ్రేయాస్‌ (27)తో మూడో వికెట్‌కు 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. సెంచరీ ఖాయమనిపించిన వేళ వైభవ్‌ 15వ ఓవర్‌లో లాంగా్‌ఫలో ఇవాన్స్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. తను నిష్క్రమించాక పరుగుల వేగం తగ్గింది. మిడిలార్డర్‌లో తిలక్‌ (11 నాటౌట్‌), రింకూ సింగ్‌ (25)ను బౌలర్లు ఇబ్బందిపెట్టారు. దీంతో చివరి ఐదు ఓవర్లలో 47 పరుగులు మాత్రమే రాబట్టగలిగారు. ఆఖరి ఓవర్‌లో రింకూ 13 పరుగులు సాధించడంతో స్కోరు 200 చేరువకు వచ్చింది.


స్కోరుబోర్డు

భారత్‌: వైభవ్‌ (సి) ఇవాన్స్‌ (బి) మధెవెరె 81, అభిషేక్‌ (సి) తడివనషె (బి) ముజరబాని 2, ఇషాన్‌ (బి) రజా 29, శ్రేయాస్‌ (సి) మధెవెరె (బి) ఇవాన్స్‌ 27, తిలక్‌ (నాటౌట్‌) 11, రింకూ (సి) మధెవెరె (బి) ఇవాన్స్‌ 25; ఎక్స్‌ట్రాలు: 17; మొత్తం: 20 ఓవర్లలో 192/5; వికెట్ల పతనం: 1-20, 2-95, 3-145, 4-164, 5-192; బౌలింగ్‌: సికిందర్‌ రజా 4-0-40-1, ముజరబాని 4-0-33-1, న్యూమన్‌ 2-0-18-0, ఇవాన్స్‌ 4-0-41-2, మసకద్జా 1-0-14-0, మధెవెరె 4-0-37-1, బెనెట్‌ 1-0-7-0.

జింబాబ్వే: బెనెట్‌ (సి) వైభవ్‌ (బి) మయాంక్‌ 0, బెన్‌ కర్రాన్‌ (సి) మయాంక్‌ (బి) బిష్ణోయ్‌ 20, మైర్స్‌ (సి) శ్రేయాస్‌ (బి) యష్‌ 19, రజా (సి అండ్‌ బి) యష్‌ 0, బర్ల్‌ (నాటౌట్‌) 54, మధెవెరె (సి) తిలక్‌ (బి) మయాంక్‌ 28, తడివనషె (బి) అశోక్‌ 1, ఇవాన్స్‌ (సి) రింకూ (బి) మయాంక్‌ 14, న్యూమన్‌ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు: 20; మొత్తం: 20 ఓవర్లలో 157/7; వికెట్ల పతనం: 1-0, 2-34, 3-34, 4-65, 5-125, 6-134, 7-156; బౌలింగ్‌: మయాంక్‌ 4-0-29-3, యష్‌ 4-0-45-2, అశోక్‌ 4-0-20-1, బిష్ణోయ్‌ 4-0-24-1, సూర్యాన్ష్‌ 2-0-15-0, అభిషేక్‌ 2-0-18-0.

1

16 ఏళ్లలోపే ఎక్కువ (2) టీ20 అర్ధసెంచరీలు చేసిన బ్యాటర్‌గా వైభవ్‌. కుశాల్‌ మల్ల (నేపాల్‌)ను దాటేశాడు.

1

టీ20ల్లో ఎక్కువసార్లు (3) ఇన్నింగ్స్‌ తొలి బంతికే వికెట్‌ తీసిన భారత బౌలర్‌గా భువనేశ్వర్‌తో సమంగా నిలిచిన మయాంక్‌.

తిరిగొచ్చిన టాప్‌ర్యాంక్‌

దుబాయ్‌: టీ20 వరల్డ్‌ చాంపియన్‌ భారత జట్టు ఐసీసీ ర్యాంకింగ్స్‌లో తిరిగి నెంబర్‌వన్‌ స్థానానికి చేరింది. ఇటీవల యూకే పర్యటనలో సిరీ్‌సలు కోల్పోవడంతో రెండో స్థానానికి పడిపోయిన విషయం తెలిసిందే. అయితే జింబాబ్వేపై వరుస మ్యాచ్‌ల్లో నెగ్గడంతో .. ఆదివారం ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్‌లో భారత్‌ రెండు నుంచి అగ్ర స్థానానికి ఎగబాకింది. ఇప్పటిదాకా టాప్‌లోనున్న ఇంగ్లండ్‌ రెండో స్థానానికి పడిపోయింది. బ్యాటర్ల జాబితాలో ఇషాన్‌, అభిషేక్‌ టాప్‌-2లో కొనసాగుతున్నారు.

ఇవి కూడా చదవండి:

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్: మళ్లీ అగ్రస్థానంలో భారత్

Updated Date - Jul 27 , 2026 | 03:51 AM