Share News

స్వర్ణమే లక్ష్యంగా..

ABN , Publish Date - Sep 28 , 2026 | 05:25 AM

టీ20 వరల్డ్‌ చాంపియన్‌ భారత క్రికెట్‌ జట్టు తాజా ఆసియా గేమ్స్‌లో తమ ప్రస్థానాన్ని ఆరంభించనుంది. డిఫెండింగ్‌ చాంపియన్‌ హోదాలో సోమవారం జరిగే క్వార్టర్‌ ఫైనల్లో...

స్వర్ణమే లక్ష్యంగా..

ఉ.10 గం. నుంచి సోనీ స్పోర్ట్స్‌లో...

వరుణుడితో కష్టమే!

  • బరిలోకి భారత్‌

  • అఫ్ఘాన్‌తో క్వార్టర్స్‌ నేడు

నిస్సిన్‌: టీ20 వరల్డ్‌ చాంపియన్‌ భారత క్రికెట్‌ జట్టు తాజా ఆసియా గేమ్స్‌లో తమ ప్రస్థానాన్ని ఆరంభించనుంది. డిఫెండింగ్‌ చాంపియన్‌ హోదాలో సోమవారం జరిగే క్వార్టర్‌ ఫైనల్లో అఫ్ఘానిస్థాన్‌తో ఆడబోతోంది. ఈ గేమ్స్‌లో టీమిండియాకిదే తొలి మ్యాచ్‌. భారత్‌ అదే జట్టుతో పోటీలో ఉండగా, అఫ్ఘాన్‌ మాత్రం తమ ద్వితీయ శ్రేణి ఆటగాళ్లను పంపింది. 2023 గేమ్స్‌లో భారత్‌ కూడా ద్వితీయ శ్రేణి జట్టును పంపినా.. ఈసారి మాత్రం శ్రేయాస్‌, బుమ్రా, అక్షర్‌, అభిషేక్‌, శాంసన్‌, ఇషాన్‌లాంటి స్టార్‌ ఆటగాళ్లను ఆడిస్తోంది. ఇక ఓపెనర్‌గా వైభవ్‌కు చాన్సిస్తారా? లేక అభిషేక్‌-శాంసన్‌ జోడీనే కొనసాగిస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది.

రద్దయితే సెమీస్‌కు : భారత్‌-అఫ్ఘాన్‌ మ్యాచ్‌కు సోమవారం వర్షం నుంచి ముప్పు పొంచి ఉంది. ఒకవేళ ఈ మ్యాచ్‌ రద్దయితే మాత్రం ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో మెరుగైన స్థానంలో ఉన్న భారత జట్టు సెమీఫైనల్లోకి అడుగుపెడుతుంది. ఈ మైదానంలో గత శుక్రవారం జరిగిన రెండు మ్యాచ్‌లు కూడా వర్షం కారణంగానే రద్దయ్యాయి.

ఇవి కూడా చదవండి:

అభయ్ సింగ్‌కు రూ.50 లక్షల నజరానా.. ప్రకటించిన సీఎం విజయ్

Updated Date - Sep 28 , 2026 | 05:25 AM