Share News

విజృంభించిన యశ్‌, జైన్‌

ABN , Publish Date - Jul 03 , 2026 | 01:38 AM

బౌలర్లు యశ్‌ ఠాకూర్‌, సారాంశ్‌ జైన్‌ చెరో రెండు వికెట్లతో రాణించడంతో.. కెప్టెన్‌ సహన్‌ అరాచిచిగే (83 బ్యాటింగ్‌) అజేయ అర్ధ శతకంతో ఆదుకొన్నాడు. దీంతో...

విజృంభించిన యశ్‌, జైన్‌

  • శ్రీలంక-ఎ 288/5

  • భారత్‌-ఎతో రెండో టెస్ట్‌

గాలె: బౌలర్లు యశ్‌ ఠాకూర్‌, సారాంశ్‌ జైన్‌ చెరో రెండు వికెట్లతో రాణించడంతో.. కెప్టెన్‌ సహన్‌ అరాచిచిగే (83 బ్యాటింగ్‌) అజేయ అర్ధ శతకంతో ఆదుకొన్నాడు. దీంతో భారత్‌-ఎతో గురువారం ఆరంభమైన రెండో అనధికార టెస్ట్‌లో శ్రీలంక-ఎ 288/5 స్కోరు చేసింది. తొలి రోజు ఆట ఆఖరుకు సహన్‌తోపాటు చమిక గుణశేఖర (6 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నాడు. ఓపెనర్‌ సోహన్‌ డి లెవేరా (28), అసన్‌ బండార (34)ను యశ్‌ అవుట్‌ చేయగా.. నువనిదు ఫెర్నాండ్‌ (44), అంజల భండార (42)ను ఆఫ్‌ స్పిన్నర్‌ జైన్‌ పెవిలియన్‌ చేర్చాడు. మరో ఓపెనర్‌ విక్రమసింగె (39)ను గుర్నీత్‌ బ్రార్‌ అవుట్‌ చేశాడు.

ఈ వార్తలనూ చదవండి:

వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఖాయమా.. జట్టు కూర్పు ఇలా ఉంటుందా..

మెస్సీకి ఒక న్యాయం.. బలోగన్‌కు మరో న్యాయమా.. అభిమానుల ఆగ్రహం..

Updated Date - Jul 03 , 2026 | 01:38 AM