నేనూ తప్పులు చేశా..
ABN , Publish Date - Mar 17 , 2026 | 03:05 AM
విరా ట్, రోహిత్‌ల టెస్టు రిటైర్మెంట్ వెనుక కోచ్ గౌతం గంభీర్ పాత్ర ఉందని మెజారిటీ క్రికెట్ అభిమానులు విశ్వసిస్తుంటారు. ఎందుకంటే తను బాధ్యతలు తీసు కున్నాక ఏడాదిలోనే ఈ ఇద్దరు...
న్యూఢిల్లీ: విరా ట్, రోహిత్‌ల టెస్టు రిటైర్మెంట్ వెనుక కోచ్ గౌతం గంభీర్ పాత్ర ఉందని మెజారిటీ క్రికెట్ అభిమానులు విశ్వసిస్తుంటారు. ఎందుకంటే తను బాధ్యతలు తీసు కున్నాక ఏడాదిలోనే ఈ ఇద్దరు సీనియర్లు సుదీర్ఘ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికారు. అయితే వెటరన్ ఆటగాళ్లతో ప్రధాన కోచ్‌కు పొసగడంలేదంటూ బయట వినిపించే వార్తలను ఎలా ఎదుర్కొన్నారనే ప్రశ్నకు గంభీర్ సమాధానమిస్తూ.. ‘నేనూ మనిషినే. గత 18 నెలలుగా కచ్చితంగా పొరపాట్లు చేసి ఉండొచ్చు. కానీ సరైన ఉద్దేశంతో తీసుకున్న తప్పుడు నిర్ణయాలు ఆమోదయోగ్యమే. అలాగే తప్పుడు ఉద్దేశంతో తప్పుడు నిర్ణయా లు తీసుకుంటే మాత్రం సరైన చర్య అనిపించుకోదు’ అని నర్మగర్భంగా గంభీర్ తెలిపా డు. మరోవైపు మాజీ కెప్టెన్ ధోనీని భారత జట్టు కోచ్‌గా చూడాలనుకుంటున్నట్టు గంభీర్ చెప్పాడు. ‘టీ20 వరల్డ్‌కప్ ఫైనల్ కోసం ధోనీ స్టేడియానికి రావడం చాలా బాగుంది. అలాగే తను నన్ను నవ్వమని కోరడం కూడా సరదాగా అనిపించింది. అలాగే ఏదో ఒకరోజు ధోనీ నా స్థానంలో ఉండాలని, డగౌట్‌లో తను కూడా చిరునవ్వులు చిందించాలని నేను కూడా కోరుకుంటున్నా’ అని గౌతీ పేర్కొన్నాడు.
ఇవి కూడా చదవండి:
అక్కడ ఐపీఎల్ మ్యాచ్‌లు.. కర్ణాటక ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
న్యూజిలాండ్‌కు మరో భారీ ఎదురు దెబ్బ!