Share News

ఇంగ్లండ్‌దే వన్డే సిరీస్‌

ABN , Publish Date - Sep 28 , 2026 | 04:56 AM

శ్రీలంకతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను ఇంగ్లండ్‌ 2-1తో సొంతం చేసుకుంది. ఆదివారం జరిగిన ఆఖరి మ్యాచ్‌లో..

ఇంగ్లండ్‌దే వన్డే సిరీస్‌

లండన్‌: శ్రీలంకతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను ఇంగ్లండ్‌ 2-1తో సొంతం చేసుకుంది. ఆదివారం జరిగిన ఆఖరి మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు 223 పరుగులతో ఘన విజయం సాధించింది. మొదట ఇంగ్లండ్‌ 50 ఓవర్లలో 355/7 స్కోరు చేసింది. బాంటన్‌ (126) సెంచరీ చేయగా, బ్రూక్‌ (77), కాక్స్‌ (76) రాణించారు. అసిత ఫెర్నాండో మూడు, సచిందు రెండు వికెట్లు తీశారు. భారీ ఛేదనలో ఇంగ్లండ్‌ బౌలర్ల ధాటికి శ్రీలంక 29.1 ఓవర్లలో 132 పరుగులకే కుప్ప కూలింది. డాసన్‌ మూడు, అట్కిన్సన్‌ రెండు వికెట్లు పడగొట్టారు.

ఇవి కూడా చదవండి:

అభయ్ సింగ్‌కు రూ.50 లక్షల నజరానా.. ప్రకటించిన సీఎం విజయ్

Updated Date - Sep 28 , 2026 | 04:56 AM