చెన్నై సూపర్ కింగ్స్ చీఫ్ కోచ్ జహీర్ ఖాన్
ABN , Publish Date - Sep 22 , 2026 | 05:36 AM
టీమిండియా మాజీ పేసర్ జహీర్‌ఖాన్ ఐపీఎల్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) ప్ర ధాన కోచ్‌గా నియమితుడయ్యాడు...
చెన్నై: టీమిండియా మాజీ పేసర్ జహీర్‌ఖాన్ ఐపీఎల్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) ప్ర ధాన కోచ్‌గా నియమితుడయ్యాడు.ఈ విషయాన్ని ఫ్రాంచైజీ సోమవారం వెల్లడించింది. 18 సీజన్లపాటు హెడ్ కోచ్‌గా వ్యవహరించిన స్టీఫెన్ ఫ్లెమింగ్ స్థానంలో 48 ఏళ్ల జహీర్ బాధ్యతలు చేపట్టనున్నాడు. ‘చెన్నై సూపర్ కింగ్స్ హెడ్ కోచ్‌గా జహీర్ ఖాన్‌ను స్వాగతిస్తున్నాం’ అని ఫ్రాంచైజీ ఎక్స్‌లో పేర్కొంది.