బీసీసీఐ ఖాతాలో రూ.1600 కోట్లు
ABN , Publish Date - Mar 27 , 2026 | 02:14 AM
ఐపీఎల్ ఫ్రాంచైజీలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ అమ్మకాల వ్యవహారంలో బీసీసీఐ కూడా భారీ స్థాయిలో లాభపడనుంది. ఆర్‌సీబీని...
న్యూఢిల్లీ: ఐపీఎల్ ఫ్రాంచైజీలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ అమ్మకాల వ్యవహారంలో బీసీసీఐ కూడా భారీ స్థాయిలో లాభపడనుంది. ఆర్‌సీబీని రూ.16,750 కోట్లకు ఆదిత్య బిర్లా కన్సార్టియం, రాజస్థాన్‌ను రూ.15,300 కోట్లకు యూఎస్ వ్యాపారవేత్త కల్ సోమానీ కన్సార్టియం కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అయితే నిబంధనల ప్రకారం ఫ్రాంచైజీ కొత్త యజమాని తాము కొనుగోలు చేసిన విలువలో 5 శాతాన్ని బీసీసీఐకి ఫీజు రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. దీంతో ఆర్‌సీబీ నుంచి రూ.837 కోట్లు, ఆర్‌ఆర్ నుంచి రూ.765 కోట్లు బోర్డుకు అందనున్నాయి. ఓవరాల్‌గా రెండు జట్ల అమ్మకాలతో బీసీసీఐ ఖజానాలో రూ.1602 కోట్లు చేరనుండడం విశేషం.