Share News

బాబర్‌పై వేటు

ABN , Publish Date - Mar 05 , 2026 | 05:15 AM

టీ20 వరల్డ్‌కప్‌లో వైఫల్యం నేపథ్యంలో పాకిస్థాన్‌ జట్టులో భారీ ప్రక్షాళన జరిగింది. వన్డే జట్టు నుంచి సీనియర్‌ బ్యాటర్‌ బాబర్‌ ఆజమ్‌, సయీమ్‌ అయూబ్‌ను తప్పించారు....

బాబర్‌పై వేటు

బంగ్లాదేశ్‌తో పాక్‌ వన్డే సిరీస్‌

లాహోర్‌: టీ20 వరల్డ్‌కప్‌లో వైఫల్యం నేపథ్యంలో పాకిస్థాన్‌ జట్టులో భారీ ప్రక్షాళన జరిగింది. వన్డే జట్టు నుంచి సీనియర్‌ బ్యాటర్‌ బాబర్‌ ఆజమ్‌, సయీమ్‌ అయూబ్‌ను తప్పించారు. బంగ్లాదేశ్‌ టూర్‌లో భాగంగా ఈ నెల 11 నుంచి జరిగే 3 వన్డేల సిరీస్‌కు ఆరుగురు అన్‌క్యాప్డ్‌ ప్లేయర్లను ఎంపిక చేశారు. టీ20 వరల్డ్‌కప్‌లో అదరగొట్టిన సాహిబ్జాదా ఫర్హాన్‌కు తొలిసారి వన్డే జట్టులో చోటు దక్కింది. షహీన్‌ షా అఫ్రీది కెప్టెన్‌గా కొనసాగనుండగా.. పేసర్‌ రౌఫ్‌, బ్యాటర్‌ హుస్సేన్‌ తలత్‌ రీఎంట్రీ ఇచ్చారు.

Updated Date - Mar 05 , 2026 | 05:15 AM