Share News

తొలిరోజే 18 వికెట్లు

ABN , Publish Date - Aug 23 , 2026 | 05:30 AM

ఆస్ట్రేలియా-బంగ్లాదేశ్‌ జట్ల మధ్య శనివారం మొదలైన రెండో టెస్ట్‌లో పేసర్లు వికెట్ల వేట సాగించారు...

తొలిరోజే 18 వికెట్లు

  • బంగ్లా 64 ఆలౌట్‌

  • ఆస్ట్రేలియా 165/8

మకే (ఆస్ట్రేలియా): ఆస్ట్రేలియా-బంగ్లాదేశ్‌ జట్ల మధ్య శనివారం మొదలైన రెండో టెస్ట్‌లో పేసర్లు వికెట్ల వేట సాగించారు. ఆసీస్‌ పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌ (6/12) తొలుత ఆరు వికెట్లతో విరుచుకుపడితే..ఆపై బంగ్లా పేసర్‌ షోరిఫుల్‌ (6/35) బెంబేలెత్తించాడు. దరిమిలా టెస్ట్‌ మొదటి రోజే 18 వికెట్లు నేల కూలాయి. టాస్‌ కోల్పోయి తొలుత బ్యాటింగ్‌ చేసిన బంగ్లా తొలి ఇన్నింగ్స్‌లో 64 రన్స్‌కే కుప్పకూలింది. నెం.11 బ్యాటర్‌ షోరిఫుల్‌ ఇస్లామ్‌ (14) టాప్‌ స్కోరర్‌. కమిన్స్‌ 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ మొదటి రోజు ఆట ముగిసేసరికి 165/8 స్కోరు చేసింది. గ్రీన్‌ (51 బ్యాటింగ్‌), స్మిత్‌ (42), హెడ్‌ (22) రాణించారు.

Updated Date - Aug 23 , 2026 | 05:30 AM