రెండో రోజే బంగ్లా ఖతం
ABN , Publish Date - Aug 24 , 2026 | 06:22 AM
బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు పరాభవానికి ఆతిథ్య ఆస్ట్రేలియా ప్రతీకారం తీర్చుకుంది. కేవలం రెండు రోజుల్లోనే ముగిసిన ఈ రెండో టెస్టులో కంగారూలు ఇన్నింగ్స్ 51 పరుగుల తేడాతో ఘనవిజయం...
ఇన్నింగ్స్ తేడాతో ఆసీస్ గెలుపు
1-1తో సిరీస్ సమం
మకాయ్: బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు పరాభవానికి ఆతిథ్య ఆస్ట్రేలియా ప్రతీకారం తీర్చుకుంది. కేవలం రెండు రోజుల్లోనే ముగిసిన ఈ రెండో టెస్టులో కంగారూలు ఇన్నింగ్స్ 51 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించారు. దీంతో ఈ సిరీస్ 1-1తో సమమైంది. తొలి ఇన్నింగ్స్‌లో 64 పరుగులకే కుప్పకూలిన బంగ్లా.. ఆదివారం తమ రెండో ఇన్నింగ్స్‌లో 95 పరుగులు మాత్రమే చేయగలిగింది. కెప్టెన్ షంటో (31), ముష్ఫికర్ (29) మాత్రమే రెండంకెల స్కోర్లు సాధించారు. చివరి సెషన్ తొలి ఓవర్‌లోనే మిగిలిన రెండు వికెట్లు కోల్పోవడంతో మ్యాచ్ ముగిసింది. పేసర్ మిచెల్ స్టార్క్ (4/39) మరోసారి చెలరేగి బంగ్లా పతనాన్ని శాసించాడు. అంతకుముందు ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 210 పరుగులు చేసింది. షోరిఫుల్‌కు ఏడు వికెట్లు దక్కాయి. ఇక ఓవరాల్‌గా పది వికెట్లు తీసిన స్టార్క్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌తో పాటు సిరీస్ కూడా దక్కింది.