Share News

ఐపీఎల్‌ నుంచి ఆకాశ్‌ అవుట్‌

ABN , Publish Date - Mar 22 , 2026 | 05:10 AM

ఐపీఎల్‌ ఆరంభానికి ముందే కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు మరో ఝలక్‌ తగిలింది. ఈసారి పేసర్‌ ఆకాశ్‌ దీప్‌ కూడా వెన్నునొప్పితో లీగ్‌కు...

ఐపీఎల్‌ నుంచి ఆకాశ్‌ అవుట్‌

కోల్‌కతా: ఐపీఎల్‌ ఆరంభానికి ముందే కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు మరో ఝలక్‌ తగిలింది. ఈసారి పేసర్‌ ఆకాశ్‌ దీప్‌ కూడా వెన్నునొప్పితో లీగ్‌కు దూరమయ్యాడు. అతడికి 8 నుంచి 12 వారాలపాటు విశ్రాంతి అవసరమని వైద్యులు స్పష్టం చేశారు. దీంతో అఫ్ఘానిస్థాన్‌తో జరిగే ఏకైక టెస్టుకు కూడా ఆకాశ్‌ దూరమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే కేకేఆర్‌కు హర్షిత్‌ రాణా దూరం కాగా, పథిరన ఫిట్‌నె్‌సపై సందేహాలు నెలకొన్నాయి.

Updated Date - Mar 22 , 2026 | 05:10 AM