రహానె రెండో ఇన్నింగ్స్
ABN , Publish Date - Aug 13 , 2026 | 05:26 AM
ఇటీవల క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన టీమిండియా మాజీ బ్యాటర్ అజింక్యా రహానె వ్యాఖ్యాతగా రెండో ఇన్నింగ్స్...
వ్యాఖ్యాతగా ఇక కొత్త ఆట
భారత్-శ్రీలంక సిరీస్‌తో మొదలు
ముంబై: ఇటీవల క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన టీమిండియా మాజీ బ్యాటర్ అజింక్యా రహానె వ్యాఖ్యాతగా రెండో ఇన్నింగ్స్ ఆరంభించనున్నాడు. ఈనెల 15న ప్రారంభమయ్యే భారత్-శ్రీలంక టెస్ట్ సిరీ్‌సకు అతడు కామెంటేటర్‌గా వ్యవహరించనున్నాడు. ‘భారత్-శ్రీలంక సిరీస్ ద్వారా వ్యాఖ్యాతగా కొత్త పాత్ర పోషించేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. క్రికెట్‌లో టెస్ట్ మ్యాచ్‌లే అత్యున్నతం. ఈ ఫార్మాట్‌లో సుదీర్ఘకాలం భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆటగాడిగా క్రికెట్‌ను మరో కోణంలో చూడబోవడం ప్రత్యేకంగా ఉంది’ అని 37 ఏళ్ల రహానె అన్నాడు.