క్రికెటర్ల దాడిలో కోచ్ మృతి
ABN , Publish Date - Aug 14 , 2026 | 05:19 AM
క్రికెట్ మ్యాచ్ సందర్భంగా జరిగిన గొడవలో ఆటగాడు చేసిన దాడిలో గాయపడిన 62 ఏళ్ల కోచ్ సుమిత్ ఫెర్నాండో మరణించాడు....
కొలంబో: క్రికెట్ మ్యాచ్ సందర్భంగా జరిగిన గొడవలో ఆటగాడు చేసిన దాడిలో గాయపడిన 62 ఏళ్ల కోచ్ సుమిత్ ఫెర్నాండో మరణించాడు. క్రికెట్ మైదానంలో మంచినీటి వసతి విషయమై సుమిత్‌తో కొందరు ఆటగాళ్లు గొడవ పడినట్టు తెలిసింది. ఈ వివాదంలో క్రికెటర్లలో ఒకరిపై ఫెర్నాండో దాడికి యత్నించాడు. ఈక్రమంలో మరో ఆటగాడు సుమిత్‌ను కొట్టినట్టు తెలిసింది. గాయపడిన సుుమిత్‌ను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. ఈ కేసుకు సంబంధించి 17 ఏళ్ల స్కూల్ క్రికెటర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా..శ్రీలంక మాజీ కెప్టెన్ కుశాల్ మెండిస్ స్కూల్ క్రికెటర్‌గా ఉన్న సమయంలో ఫెర్నాండో అతడికి కోచ్‌గా వ్యవహరించాడు.