యూరోపియన్ టీ20 లీగ్‌లో గేల్ ఎంట్రీ
ABN , Publish Date - Apr 21 , 2026 | 07:06 AM
వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం క్రిస్ గేల్ కూడా ఫ్రాంచైజీ క్రికెట్‌లో ఓ జట్టును సొంతం చేసుకొన్నాడు..
న్యూఢిల్లీ: వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం క్రిస్ గేల్ కూడా ఫ్రాంచైజీ క్రికెట్‌లో ఓ జట్టును సొంతం చేసుకొన్నాడు. యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్ (ఈటీపీఎల్)లో కొత్తగా ప్రకటించిన గ్లాస్గో ముగాఫియాన్స్ జట్టు సహ యజమాని, గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్‌గా గేల్ వ్యవహరించనున్నాడు. కాగా, ఈ జట్టుకు అభిషేక్ బచ్చన్ కూడా సహ యజమానిగా ఉన్నాడు. ఆరు జట్ల (గ్లాస్గో, ఆమ్‌స్టర్‌డామ్, డబ్లిన్, ఎడిన్‌బరో, బెల్‌ఫాస్ట్, రోటర్‌డామ్) ఈటీపీఎల్ ఆరంభ అంచె ఈ ఏడాది ఆగస్టు 26 నుంచి సెప్టెంబరు 20 వరకు జరగనుంది.
Also Read:
ఏసీబీ వలలో వీఆర్వో.. లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టివేత
జగన్‌వి క్రిమినల్ రాజకీయాలు.. మంత్రి నిమ్మల ధ్వజం
For More Latest News