Share News

భారత జట్ల శుభారంభం

ABN , Publish Date - Sep 17 , 2026 | 01:48 AM

చెస్‌ ఒలింపియాడ్‌లో స్వర్ణ పతకాలు నిలబెట్టుకొనే దిశగా భారత పురుషులు, మహిళల జట్లు శుభారంభం...

భారత జట్ల శుభారంభం

చెస్‌ ఒలింపియాడ్‌

సమర్‌ఖండ్‌ (ఉజ్బెకిస్థాన్‌): చెస్‌ ఒలింపియాడ్‌లో స్వర్ణ పతకాలు నిలబెట్టుకొనే దిశగా భారత పురుషులు, మహిళల జట్లు శుభారంభం అందుకున్నాయి. బుధవారం జరిగిన తొలి రౌండ్‌లో మహిళల జట్టు 4-0తో డొమినిక్‌ రిపబ్లిక్‌ను చిత్తు చేసింది. ఓపెన్‌ విభాగంలో మనోళ్లు.. థాయ్‌లాండ్‌పై 3-1తో గెలుపొందారు. మహిళల్లో..నలుగురికి నలుగురు కోనేరు హంపి, ఆర్‌.వైశాలి, వంతిక అగర్వాల్‌, సవితశ్రీ విజయాలు దక్కించుకున్నారు. పురుషుల్లో నిహాల్‌ సరిన్‌, విదిత్‌ గుజ్‌రాతీ, ప్రపంచ చాంపియన్‌ గుకేష్‌ ప్రత్యర్థులపై నెగ్గగా, గ్రాండ్‌మాస్టర్‌ అర్జున్‌ ఇరిగేసి పరాజయం చవిచూశాడు.

Also Read:

భారత సినీ రంగానికి అనంత్ నాగ్‌ సేవలు స్ఫూర్తిదాయకం: పవన్ కల్యాణ్

రుణాల మంజూరుపై బ్యాంకులు దృష్టి పెట్టాలి: సీఎం చంద్రబాబు

Updated Date - Sep 17 , 2026 | 01:48 AM