అల్కారజ్.. వింబుల్డన్‌కూ దూరం
ABN , Publish Date - May 20 , 2026 | 01:31 AM
వచ్చేవారం మొదలయ్యే ఫ్రెంచ్ ఓపెన్ నుంచి ఇప్పటికే వైదొలగిన టెన్నిస్ స్టార్ కార్లోస్ అల్కారజ్ (స్పెయిన్).. వచ్చేనెలలో జరిగే...
లండన్: వచ్చేవారం మొదలయ్యే ఫ్రెంచ్ ఓపెన్ నుంచి ఇప్పటికే వైదొలగిన టెన్నిస్ స్టార్ కార్లోస్ అల్కారజ్ (స్పెయిన్).. వచ్చేనెలలో జరిగే వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్‌కు కూడా దూరమయ్యాడు. గతనెల బార్సిలోనా ఓపెన్ సందర్భంగా అల్కారజ్ కుడి మోచేతికి గాయమైన సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నందున.. కోర్టులోకి వచ్చేందుకు సిద్ధంగా లేనని రెండుసార్లు వింబుల్డన్ విజేత అల్కారజ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
ఇవి కూడా చదవండి..
ప్రభాకరన్‌కు విజయ్ నివాళి.. రాజీవ్ గాంధీ హత్యను గుర్తుచేసిన బీజేపీ..
బీజేపీ బెదిరింపులతోనే పోటీ నుంచి తప్పుకున్న జహంగీర్ ఖాన్.. టీఎంసీ ఫైర్