Share News

గాబ్రియెల్‌ గోల్‌..బ్రెజిల్‌ జిగేల్‌

ABN , Publish Date - Jun 30 , 2026 | 04:01 AM

స్టాపేజ్‌ టైంలో ఫార్వర్డ్‌ గాబ్రియెల్‌ మార్టినెల్లీ విన్నింగ్‌ గోల్‌తో.. ఐదుసార్లు చాంపియన్‌ బ్రెజిల్‌ ప్రీక్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. సోమవారం రాత్రి జరిగిన ...

గాబ్రియెల్‌ గోల్‌..బ్రెజిల్‌ జిగేల్‌

  • ప్రీక్వార్టర్స్‌కు సాంబా జట్టు

  • స్టాపేజ్‌ టైంలో గాబ్రియెల్‌ అద్భుతం

  • 1-2తో పోరాడి ఓడిన జపాన్‌

హూస్టన్‌: స్టాపేజ్‌ టైంలో ఫార్వర్డ్‌ గాబ్రియెల్‌ మార్టినెల్లీ విన్నింగ్‌ గోల్‌తో.. ఐదుసార్లు చాంపియన్‌ బ్రెజిల్‌ ప్రీక్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. సోమవారం రాత్రి జరిగిన రౌండ్‌-32 నాకౌట్‌ మ్యాచ్‌లో బ్రెజిల్‌ 2-1తో జపాన్‌పై గెలిచింది. సాంబా జట్టు తరఫున కాసమిరో (56వ నిమిషం), గాబ్రియెల్‌ (90+5వ) చెరో గోల్‌ చేశారు. కైషు సానో (29వ నిమిషం) జపాన్‌కు ఏకైక గోల్‌ అందించాడు. మ్యాచ్‌ ఆరంభం నుంచి బ్రెజిల్‌ ఆధిపత్యం కొనసాగింది. అయితే, 29వ నిమిషంలో జపాన్‌ ప్లేయర్‌ కైషు సానో గోల్‌తో బ్రెజిల్‌కు షాకిచ్చాడు. డిఫెండర్‌ డానిలో పాస్‌ను దొరకబుచ్చుకొన్న సానో.. సాంబా మిడ్‌ఫీల్డర్‌ కాసమిరోను తప్పించుకొంటూ బాక్స్‌ బయట నుంచి నేరుగా కొట్టిన కిక్‌ గోల్‌లో పడడంతో జపాన్‌ 1-0 ఆధిక్యంలో నిలిచింది. దీంతో విస్తుపోయిన బ్రెజిల్‌ ఒక్కసారిగా విరుచుకుపడింది. ఈ క్రమంలో 36వ నిమిషంలో వినీసియ్‌సకు గోల్‌ చేసే సువర్ణావకాశం దక్కినా.. జపాన్‌ కీపర్‌ సుజికి దాన్ని అడ్డుకొన్నాడు. ఆ తర్వాత కూన్హా చేసిన ప్రయత్నం కూడా విఫలమైంది. ఆ తర్వాత జపాన్‌ డిఫెన్స్‌ మరింత అప్రమత్తంగా వ్యవహరించడంతో.. బ్రెజిల్‌ గోల్‌ ఖాతా తెరవకుండానే ఫస్టా్‌ఫను ముగించింది. వెనుకబడడంతో తీవ్ర ఒత్తిడిలో పడిన బ్రెజిల్‌.. సెకండా్‌ఫలో జపాన్‌ గోల్‌పోస్టుపై దాడుల పరంపరను కొనసాగించింది. ఈ క్రమంలో 56వ నిమిషంలో తగిన ఫలితం సాధించింది. గాబ్రియెల్‌ క్రాస్‌ను కాసమిరో హెడర్‌తో గోల్‌లోకి పంపి 1-1తో సమం చేశాడు. ఒక్కసారిగా ఊపిరిపీల్చుకొన్న సాంబా జట్టు.. పదునైన దాడులతో జపాన్‌ రక్షణపంక్తిని మరోసారి బద్దలుకొట్టే ప్రయత్నం చేసింది. 59వ నిమిషంలో బంతిని అందుకొన్న వినిసియస్‌ చాకచక్యంగా డిఫెండర్లను తప్పించుకొంటూ జపాన్‌ గోల్‌వైపు షూట్‌ చేశాడు. కానీ, బంతి గోల్‌ పోస్టును తగిలి బయటకు రావడంతో ఆధిక్యం సాధించే అవకాశం చేజారింది. ఆ తర్వాత బ్రెజిల్‌కు కార్నర్‌ లభించినా.. జపాన్‌ సమర్థంగా అడ్డుకొంది. మ్యాచ్‌ అదనపు సమయం దిశగా సాగుతున్న తరుణంలో.. ఇంజ్యూరీ టైంలో జపాన్‌ పెనాల్టీ ఏరియాలో బ్రూనో ఇచ్చిన పాస్‌ను అందుకొన్న గాబ్రియెల్‌.. లాఘవంగా గోల్‌లోకి పంపి బ్రెజిల్‌ను రౌండ్‌-16కు చేర్చగా.. జపాన్‌ గుండె పగిలింది.

2.jpg

Updated Date - Jun 30 , 2026 | 04:01 AM